Begin typing your search above and press return to search.
ఘోరం : పాము మెడకు కండోమ్ .. !
By: Tupaki Desk | 21 Feb 2021 12:30 AM GMTపాము తలకు కండోమ్ బిగించిన దారుణమైన సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాము తలకి ఆ కండోమ్ బాగా బిగుతుగా బిగించుకుపోవడంతో ఆ పాము ఊపిరి తీసుకోలేక నానా ఇబ్బందులు పడింది. ఇంతో ఎవరో దాన్ని అలా చూసి దాని తలనుంచి కండోమ్ ను తొలగించటంతో బతికి బైటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ముంబైలోని మిడోస్ హౌసింగ్ సొసైటీ ఏరియాలో నివాసం ఉంటున్న వైశాలి తన్హా అనే యువతికి ఓ పాము తలకు చిన్న ప్లాస్టిక్ బ్యాగుతో దిక్కుతోచని స్థితిలో అటుఇటు కదులుతూ కనిపించింది. ఆమె దాని దగ్గరకు వెళ్లి చూసింది. తలపై ఉన్నది ప్లాస్టిక్ బ్యాగు కాదని, కండోమ్ అని గుర్తించింది. వెంటనే మిఠా మల్వంకర్ అనే పాముల సంరక్షకుడికి ఫోన్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మల్వంకర్ 2.5 అడుగుల నీటి పామును చేతుల్లోకి తీసుకున్నాడు.
కండోమ్‌ని తీసిపారేసి రక్షించాడు. అయితే కండోమ్ కారణంగా సరిగా ఊపిరి తీసుకోలేకపోయిన పాము అస్వస్థతకు గురైంది. దాన్ని సంజయ్ గాంధీ నేషనల్ పార్కుకు తరలించి చికిత్స అందించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుభవం ఉన్న వ్యక్తే పాము మెడకు కండోమ్ కట్టి ఉంటాడని, అది విషరహితమైనదైనా దాని కాట్లు దారుణంగా ఉంటాయని మల్వంకర్ తెలిపాడు.సంజయ్ గాంధీ నేషనల్ పార్కులో నిపుణులు ఆ పాముకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనిపై వన్యప్రాణి పశువైద్య అధికారి డాక్టర్ శైలేష్ పేతే మాట్లాడుతూ..కండోమ్ చాలా టైటుగా ఉండటంతో పాము ఒత్తిడికి గురైంది కానీ..పాముమీద ఎటువంటి గాయాలు లేవనీ అది త్వరగానే కోలుకుంటుందని తెలిపారు.