Begin typing your search above and press return to search.

కండోమ్ ప్యాకెట్ తో కట్టుకట్టారు.. డాక్టర్లు షాక్

By:  Tupaki Desk   |   23 Aug 2022 1:30 AM GMT
కండోమ్ ప్యాకెట్ తో కట్టుకట్టారు.. డాక్టర్లు షాక్
X
సాధారణంగా శరీరానికి గాయమైతే కాటన్, బ్యాండేజ్ తో కట్టు కడుతారు. కానీ ఓ మహిళ తలకు గాయమైతే బ్యాండేజ్ బదులు కండోమ్ ప్యాక్ తో కట్టుకట్టారు. ఈ దారుణం చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరీ నిర్లజ్జగా మారుతోంది. దేంతో కట్టు కట్టాలో కూడా తెలియకుండా వ్యవహరిస్తున్నారు. వైద్యసిబ్బంది వ్యవహారం కారణంగా రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ తలకు గాయమైతే... ఆమె చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. అక్కడున్న డాక్టర్లు తలకు కట్టిన కట్టు విప్పి చూసి కంగుతిన్నారు. తలపై కండోమ్ ప్యాకెట్ దర్శనమివ్వడంతో వారంతా షాక్ కు గురయ్యారు.

మధ్యప్రదేశ్ కు చెందిన రేష్మాబాయి అనే మహిళ తలకు తీవ్రమైన గాయమైంది. ఆమె ప్రాథమిక చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లింది. అక్కడున్న సిబ్బంది.. ఆమెకు కట్టుకట్టారు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది. కాటన్ పెట్టాల్సిన చోట కండోమ్ ప్యాకెట్ ఉంచి కట్టుకట్టారు. అనంతరం ఆమెను మొరెనా జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లిన ఆ మహిళ ను పరీక్షించిన డాక్టర్లు చూసి కంగుతిన్నారు.

మహిళ తలకు కాటన్ ఉండాల్సిన చోట కండోమ్ ప్యాకెట్ ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. ఇక ఈ విషయం కాస్తా వైద్యశాఖ ఉన్నతాధికారుల దాకా వెళ్లడంతో వారు విచారణకు ఆదేశించారు.

ఈ వ్యవహారానికి బాధ్యులైన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తలకు కండోమ్ ప్యాకెట్ కట్టిన వ్యక్తిని అధికారులు సస్పెండ్ చేసినట్టు తెలిసింది. కాగా ప్రస్తుతం ఈ ఘటన వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి మచ్చుతునకగా మారింది.

అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్యాండేజీ కొరత వల్ల ఇలా చేసి ఉంటారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.