Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్... కండోమ్స్ - ఐపిల్స్ సేల్స్ జూమ్
By: Tupaki Desk | 26 March 2020 2:30 AM GMTకరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... దాదాపుగా అన్ని రకాల వ్యాపకాలు తగ్గిపోతున్న వేళ.... నాలుగ్గోడల మధ్య సాగుతున్న రసపట్లు మాత్రం జోరందుకున్నాయట. దీనికి నిదర్శనంగా... రసపట్టులో వినియోగించే కండోమ్స్, ఐపిల్స్ అమ్మకాలు ఓ రేంజిలో దూసుకుపోతున్నాయి. నిజమా? అంటే... ఈ రెండింటి అమ్మకాల్లో నమోదవుతున్న భారీ ప్రగతిని చూసిన తర్వాత నిజమని నమ్మక తప్పదు. ఇంటరెస్టింగ్ గా అనిపిస్తున్న ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకి వెళితే..
కరోనా వేళ... దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఉత్పత్తి రంగం దాదాపుగా స్తంభించిపోగా... ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అంతా ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. అదే సమయంలో అరకొరగానే అయినా పని సాగిస్తున్న రంగాలు కూడా వర్క్ ఫ్రం హోం బాట పట్టడంతో ఆ రంగాల వారు కూడా ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ఈ పరిస్థితి బాగానే అనునకూలించిందట.
వర్క్ లేకపోయినా... వర్క్ ఫ్రం హోం అయినా... కూడా అంతా ఇంటిపట్టునే ఉండటంలో ఆలుమగల మధ్య దూరం బాగా తగ్గిపోయిందట. ఇంకేముంది రోజంతా ఇంటిలోనే ఉంటే... వారి మధ్య శృంగారం పాళ్లు కూడా భారీగా పెరిగిపోయిందట. దీంతో కండోమ్స్, ఐపిల్స్ సేల్స్ దూసుకుపోతున్నాయట. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినట్లుగా వచ్చేనెల 14 దాకా ఇదే పరిస్థితి కొనసాగడం ఖాయమే అయిన నేపథ్యంలో అప్పటిదాకా ఇటు నిత్యావసరాలతో పాటు కండోమ్స్, ఐపిల్స్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.