Begin typing your search above and press return to search.

వైరల్ ఫైన్.. కండోమ్ లేదని జరిమానా.?

By:  Tupaki Desk   |   21 Sep 2019 8:20 AM GMT
వైరల్ ఫైన్.. కండోమ్ లేదని జరిమానా.?
X
కొత్త వాహన చట్టం దేశవ్యాప్తంగా వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. జరిమానా కట్టలేక కొందరు వాహనాలను కూడా వదిలిపెట్టి పోతున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలోని ఈ భారీ జరిమానాలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

తాజాగా ఢిల్లీలో విధించిన ఓ జరిమానా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఓ క్యాబ్ డ్రైవర్ సోషల్ మీడియాలో తనకు విధించిన ఫైన్ ను షేర్ చేయడంతో ఇది కాస్తా సంచలనమైంది..

ఢిల్లీకి చెందిన క్యాబ్ డ్రైవర్ ధర్మేంద్ర కు తాజాగా ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారట.. క్యాబ్ లోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కండోమ్ లేదని చెప్పి ఈ జరిమానా వేశారు. దీంతో అతడు తన తోటి క్యాబ్ డ్రైవర్లు ఉన్న గ్రూపులో ఆ చలానాను ఫొటో తీసి షేర్ చేసి అందరూ కండోమ్ ప్యాకెట్లను క్యాబ్ లో పెట్టుకోవాలని హెచ్చరించాడు. ఈ విషయం తెలిసిన ఢిల్లీ సర్వోదయ డ్రైవర్ అసోసియేట్ ప్రెసిడెంట్ కండోమ్ ప్యాకేట్లను క్యాబ్ డ్రైవర్లు అంతా తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చారు. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అయిపోయింది.

అయితే దీనిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కొత్త వాహన చట్టంలో అసలు క్యాబ్ లో కండోమ్ ఉంచుకోవాలనే నిబంధన ఏదీ లేదని.. ఎందుకు చలానా విధించారనే విషయంపై పోలీసులను ఆరాతీస్తున్నామని తెలిపారు. క్యాబ్ లో కండోమ్ లేదని జరిమానా వేసిన పోలీసులపై ఫిర్యాదు చేస్తే వారిపై చర్య తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.