Begin typing your search above and press return to search.

లేడీ కండ‌క్ట‌ర్ రిబ్బ‌న్ క‌ట్ చేస్తే 50వేలు!

By:  Tupaki Desk   |   18 Jan 2023 2:30 AM GMT
లేడీ కండ‌క్ట‌ర్ రిబ్బ‌న్ క‌ట్ చేస్తే 50వేలు!
X
బుల్లితెర‌పై జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోతో పాటు అదుర్స్.. శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల‌కు మాస్ లో గొప్ప‌ ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. శ్రీ‌దేవి డ్రామా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ కామెడీ షోలలో ఒకటి. ఆటో రాంప్రసాద్- హైపర్ ఆది- తాగుబోతు రమేష్- చలాకీ చంటి- రాకెట్ రాఘవ తదితరులు తమ చమత్కారమైన పంచ్ లతో వినోదాన్ని పంచుతుంటారు. శ్రీకాకుళం జానపద పాటలు ప్రదర్శనను చూడవలసిన ముఖ్యాంశాలలో ఒకటి.

ఇటీవ‌ల‌ ట్రెండింగ్ లో ఉన్న పల్సర్ బైక్ జానపద గీతాన్ని గాజువాక డిపోకు చెందిన ఆర్టీసీ బస్ కండక్టర్ ఝాన్సీ పాడారు. ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ వీక్ష‌కులంద‌రినీ ఉర్రూతలూగించింది. యాంక‌ర్ రష్మీ గౌతమ్ ‍- జడ్జి ఆమని వంటి వారు ఆమెతో పాటు కాలు క‌దిపిన ఎపిసోడ్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ చూసిన నెటిజన్లు కండక్టర్ డ్యాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గ‌త ఏడాది ఆగ‌స్టు నుంచి ఈ షో ర‌న్ అయింది. మధ్యాహ్నం 1 గంటలకు ETV ఛానెల్ లో ప్రీమియర్ అవుతోంది.

అదంతా అటుంచితే శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షోతో త‌న‌కు వ‌చ్చిన పాపులారిటీని స‌ద‌రు లేడీ కండ‌క్ట‌ర్ చాలా తెలివిగా క్యాష్ చేసుకుంటోంది. ప్ర‌స్తుతం గాజువాక స‌హా ప‌లు ఏరియాల్లో ఈ భామ‌కు క్రేజ్ అసాధార‌ణంగా ఉంది. సంక్రాంతి 2023 సంబ‌రాల్లో షోలు చేసేందుకు వేదిక‌నెక్కితే రూ.50 వేలు వ‌ర‌కూ వ‌సూలు చేస్తోంద‌ట‌. అదే ఏదైనా షాప్ ఓపెనింగుకి వెళితే రిబ్బ‌న్ క‌టింగుకు రూ.50 వేల నుంచి రూ.1ల‌క్ష వ‌ర‌కూ వ‌సూలు చేస్తోంది.

అలా ఆదాయం అమాంతం పెరిగిందని చెప్పుకుంటున్నారు. బ‌స్ కండ‌క్ట‌ర్ గా ప‌ని చేస్తే జీవితాంతం సంపాదించినా ప‌ట్టుమ‌ని నెల‌కు 10 వేలు ఈఎంఐ క‌ట్ట‌డం కూడా కండ‌క్ట‌ర్ వృత్తిలో చాలా క‌ష్టం. కానీ స‌ద‌రు గాజువాక డిపో లేడీ కండెక్ట‌ర్ సింపుల్ గా ఐదు నిమిషాల రిబ్బ‌న్ క‌టింగ్ ఈవెంట్ తో రూ.50 వేలు పైగా సంపాదించ‌డం సాటి కండ‌క్ట‌ర్ల‌కు షాక్ నిస్తోంది. ఇలాంటి ఫీట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి కూడా ఇంపాజిబుల్!! అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. కొంద‌రిలో ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం ఎక్స్ ట్రా క‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్ ఎప్పుడూ పెద్ద ప్ల‌స్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.