Begin typing your search above and press return to search.
కాన్ఫిడెన్స్ పోయి.. ఫస్ట్రేషన్ కనిపిస్తోంది కొడాలి
By: Tupaki Desk | 18 Aug 2021 9:32 AM GMTకాలం కంటే వేగంగా మారిన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది రాజకీయాలే. ఏళ్ల వ్యవధిలో రాజకీయాల్లో విలువలు మొత్తం మంటకలిసిపోయిన వైనం ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాలంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చేయటం.. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపేలా చేయటం చేసేవారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించటం.. వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠ మంటగలవకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. చర్యలతో సమస్యను పరిష్కరించేలా చేయటం అధికారంలో ఉండేవారు. ఇప్పుడా ప్రక్రియ మొత్తం మారింది. ఒకరినొకరు తిట్టుకోవటం.. అందుకు ఎంత మాట పడితేఅంత మాట అనేయటం కొందరు రాజకీయ నేతలకు అలవాటైంది. వీరి దూకుడేమో కానీ.. వారు ప్రతినిధ్యం వహిస్తున్న పార్టీలకు సైతం చెడ్డపేరును తీసుకొస్తోంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీ మంత్రి కమ్ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఆయన నోరు విప్పితే.. అవతలోడు చెవులు మూసుకునేలా విరుచుకుపడటం ఆయనకు అలవాటే. ఒకప్పుడు బాబుకు వీర విధేయుడిగా ఉన్న ఆయన.. ఆ మధ్యన వైసీపీలో చేరటం.. మిగిలిన పార్టీ నేతలతో పోలిస్తే.. సీఎం జగన్ మీద ఈగ వాలనివ్వన్నట్లుగా వ్యవహరిస్తూ లేనిపోని కష్టాల్ని తీసుకొస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గుంటూరు ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య ను నడిరోడ్డు మీద దారుణంగా హత్య చేసిన వైనం తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు విపక్షాలకు ఆయుధంగా మారితే.. అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి ఇలాంటి అనూహ్యమైన ఉదంతాలు ముఖ్యమంత్రిగా ఎవరున్నా జరిగేది. ఇదే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటం.. నిందితుడి విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యల గురించి చెప్పటం ద్వారా.. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ను చెప్పే వీలుంది.
అదేమీ లేకుండా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. సంబంధం లేని అంశాల్ని ఒక దగ్గరకు చేర్చటం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ. మంత్రి కొడాలి తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబులాంటి వెధవ దళిత యువతిని హత్య చేశాడని.. దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రికి అంటగడుతున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు.. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు.. యువతిని హత్య చేసిన నిందితుడికి తేడా లేదన్న వివాదాస్పద వ్యాఖ్య చేయటం గమనార్హం.
చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని జైలుకు పంపి.. అంతమొందిస్తే ఇలాంటి సంఘటనలు జరగవంటూ దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏం జరిగినా దానికి చంద్రబాబుకు లింకు పెట్టటం.. వెన్నుపోటు పేరుతో ఆయన్ను ఇష్టారాజ్యంగా అనే మాటలు పాతవి కావటమే కాదు.. ప్రజలకు బోర్ కొట్టించాయన్న విషయాన్ని కొడాలి నాని మర్చిపోయినట్లున్నారు. ఎన్టీఆర్ వెన్నుపోటు అన్నది అంత పాపం అయిన పక్షంలో.. ఆ రోజున చంద్రబాబు వద్దే ఉండి.. ఆయన పార్టీలో ఏళ్లకు ఏళ్లు కొనసాగిన కొడాలి కూడా పాపం చేసినట్లే కదా?
రమ్య హంతకుడితో చంద్రబాబును పోల్చిన కొడాలి.. ఒకవేళ చంద్రబాబు నిజంగానే అంత దారుణానికి పాల్పడారనుకుంటే.. అప్పట్లో ఆయనకు మద్దతుగా నిలిచిన కొడాలి కూడా అంతే పాపం చేసినట్లు కదా? హత్య చేసిన వారికి సాయం చేసిన వారు కూడా శిక్షార్హులే కదా? అలాంటప్పుడు బాబుతో పాటు కొడాలిని కూడా జైలుకు పంపాల్సి ఉంటుంది. కదా? రాజకీయాల్లో విమర్శలు మామూలే. కాలం తెచ్చిన మార్పుతో.. ఘాటు వ్యాఖ్యలు చేయటం ద్వారా ప్రజల్ని.. మీడియాను.. సోషల్ మీడియాలోనూ బాగా పాపులర్ కావొచ్చన్న దరిద్రపుగొట్టు ఆలోచన.. దారుణ పరిస్థితులకు కారణమవుతుందన్నది మర్చిపోకూడదు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడినట్లుగా ఆరోపించే కొడాలి నాని.. ఒకవేళ అదే నిజమైతే.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటేసి గెలిపించారు? అన్నది క్వశ్చన్.
ఇలాంటి లోతుల్లోకి వెళ్లినప్పుడు కొడాలి నాని మాటల్లో ఫస్ట్రేషన్ కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. గతంలో కొడాలి నాని ఏదైనా మాట్లాడితే.. ఆ మాటల్లో ఒకలాంటి కాన్ఫిడెన్స్ కనిపించేది. ఇప్పుడు దాని స్థానే ఫస్ట్రేషన్ కనిపిస్తోందన్న మాట అంతకంతకూ పెరుగుతోంది. నోటికి వచ్చినట్లు మాట్లాడటం.. సంచలన వ్యాఖ్యలు చేయటం బాగానే ఉన్నా.. వాటికి ప్రజామోదం తప్పనిసరి అన్న విషయాన్ని కొడాలి గుర్తిస్తే మంచిదంటున్నారు. లేదంటే.. మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. నోటికి వచ్చినట్లు మాట్లాడటం ద్వారా.. పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీసే కొడలి లాంటి వారిని అదుపులో ఉంచే విషయంలో సీఎం జగన్ ఒక నిర్ణయాన్ని తీసుకోవటం మంచిదంటున్నారు.