Begin typing your search above and press return to search.

శృంగారం కోసం 'గే' ల మధ్య గొడవ..: ఒకరి హత్య

By:  Tupaki Desk   |   11 Jun 2022 1:30 PM GMT
శృంగారం కోసం గే ల మధ్య గొడవ..: ఒకరి హత్య
X
కామ వాంచ తీర్చుకునేందుకు కొందరు హత్యలు చేయడానికి వెనుకాడడం లేదు. కాస్త సంతోషానికి ఏకంగా ప్రాణాలు తీయడం కలకలం రేపుతోంది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి తన కోరిక తీర్చాలని అమ్మాయి వెంట పడలేదు.. మరో పురుషుడిని ఒత్తిడి చేశాడు. దీంతో అతడు ఒప్పుకోకపోవడంతో రాష్ గా ప్రవర్తించాడు. అతడు కూడా పురుషుడు కావడంతో ఎదురుతిరిగాడు. ఈ క్రమంలో ఒకరి ప్రాణాలు పోయాయి.అయితే హత్య చేసిన వ్యక్తి 'గే' కావడం గమనార్హం. కర్ణాటకలో జరిగిన ఈ ఘోరంపై ఇప్పుడు పురుషులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు అనుకుంటున్నారు.

కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి ఓ గే. ఇతడు ఓ షాపులో పనిచేస్తూ ఓ రూం అద్దె తీసుకుని జీవిస్తున్నాడు. అయితే అమ్మాయిలా తయారై రోజూ తాను పనిచేసే షాపునకు వెళ్లేవాడు.

ఈ క్రమంతో ఇతనికి రక్షిత్ అనే ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. ప్రదీప్ అమ్మాయిలా తయారు కావడంతో ఆమె అందానికి ఫిదా అయ్యాడు రక్షిత్. అమెతో ఒక రోజు కలిసి ఉండాలని అనుకున్నాడు. ఓ రోజు తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీనికి ప్రదీప్ కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి ఏకాంతంగా గడిపారు.

అయితే ఆ తరువాత రక్షిత్ కు అసలు విషయం తెలిసింది. అయినా రక్షిత్ అతనితోనే శృంగారాన్ని కొనసాగించాడు. ఇలా కొన్ని రోజుల తరువాత ఓ రోజు ఇద్దరు కలిసి పీకలదాకా మద్యం తాగారు. ఆ తరువాత రక్షిత్ కు ప్రదీప్ తో శృంగారంలో పాల్గొనాలని అనిపించింది.

దీంతో రక్షిత్ తన కామవాంఛను తీర్చుకోవడానికి ప్రదీప్ ను బలవంతం చేశాడు. కానీ ప్రదీప్ ఒప్పుకోలేదు. దీంతో రాష్ గా ప్రవర్తించిన రక్షిత్ ను బలవంతం చేశాడు. అయినా ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు. అయితే ప్రదీప్ రక్షిత్ పై ఎదురుదాడికి దిగాడు. అదే కత్తితో రక్షిత్ పై తిరుగుదాడి చేశాడు. దీంతో రక్షిత్ అక్కడే మృతి చెందాడు.

ఆ తరువాత ప్రదీప్ ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఒకరోజు గడిచిన తరువాత కుళ్లిన వాసన వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూసేసరికి రక్షిత్ మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రదీప్ ను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కోర్టుకు తరలించారు. ఇద్దరు గేల మధ్య నెలకొన్న శృంగార గొడవ ఒకరి ప్రాణాలను బలిగొంది. అయితే మద్యం మత్తే ప్రాణాలు తీసేలా చేసిందని కొందరు అనుకుంటున్నారు.