Begin typing your search above and press return to search.
పోలీసులపై అలా మాట జారితే ఎలా బాలరాజు..?
By: Tupaki Desk | 8 Nov 2021 5:17 AM GMTఅధికారం చేతిలో ఉంటే ఏమైనా అనేయొచ్చా? ఎలా అయినా వ్యవహరించొచ్చా? నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తే.. గమ్మున ఊరుకోవటానికి పోలీసులు ఏమైనా కట్టుబానిసలు కాదు కదా? వారు చేసే డ్యూటీ సరిగా చేస్తున్నప్పుడు.. అనవసరంగా మాటలు అనేస్తుంటే చూస్తూ ఉరుకునే రోజులు పోయాయి. ఈ విషయాన్ని అధికారంలో ఉన్న వారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. తాజాగా అలాంటి పరిస్థితి ఎదురైన సందర్భంగా పోలీసులు స్పందించిన తీరుకు తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యే కమ్ విప్ గా వ్యవహరిస్తున్న బాలరాజు మరో వివాదంలో ఇరుక్కున్నారు.
ఈ మధ్యనే ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. ఈటల రాజేందర్ ఓడిపోతాడని.. ఆయన గెలిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈటల గెలిచిన తర్వాత నుంచి బాలరాజుకు అదేపనిగా ఫోన్లుచేస్తున్న వారు.. సవాలు విసిరారు కదా? మరి.. ఈటల గెలిచారు.. మీ రాజీనామా ఎప్పుడు? అంటూ సూటిగా అడిగేస్తున్న వైనంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.
ఇదే తీరు గడిచిన రెండు.. మూడు రోజులుగా సాగుతున్న వేళ.. బాలరాజు వ్యవహారం వార్తల్లో తరచూ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహం అనవసరమైన తలనొప్పికి కారణమైంది. ఎంత అధికారపక్ష ఎమ్మెల్యే అయితే మాత్రం పోలీసుల్ని ఉద్దేశించి ఆయన నోరు జారటం.. దాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అంతే వేగంగా బదులు ఇవ్వటంతో బాలరాజు నోట మాట రాని పరిస్థితి.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఇటీవల ఆయన తల్లి కాలం చేయటంతో పరామర్శ కోసం సీఎం కేసీఆర్ వచ్చారు. దీంతో.. ఆయన్ను కలిసేందుకు అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. లోపలకు పంపే విషయంలో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసి.. ఎమ్మెల్యేను అనుమతించలేదు. తాను టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి.. తమ ముఖ్యమంత్రిని కార్యక్రమానికి హాజరుకానివ్వకపోవటమా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో నియంత్రణ మిస్ అయిన బాలరాజు పోలీసుల మీద విరుచుకుపడ్డారు. అనరాని మాటను అనేశారు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు.. ఒక్కసారిగా తమ నిరసనను తెలిపారు. ఎంత ఎమ్మెల్యే మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారా? అని మండిపడ్డారు. అలా మాట్లాడితే మీ కీర్తి కిరీటం ఏమి పెరగదు.. మర్యాద ఇవ్వాలంటూ అక్కడున్న పోలీసులు మూకుమ్మడిగా మాట్లాడటంతో వారికి సమాధానం చెప్పలేని బాలరాజు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఈ ఉదంతాన్ని చూస్తే.. అనవసరమైన ఆగ్రహం ఎందుకు? ప్రశ్న రాక మానదు. నియంత్రణ లోపించి.. నోరు జారి క్లాస్ పీకించుకోవటం అవసరమా బాలరాజు? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.