Begin typing your search above and press return to search.
అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య .. దేనికోసం చేశారంటే ?
By: Tupaki Desk | 3 Nov 2020 8:30 AM GMTఅమెరికాలోని జార్జియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దేశం కాని దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటున్న హైదరాబాద్ వ్యక్తి దారుణ హత్యకి గురైయ్యాడు. భాగ్యనగరంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్ ఆరిఫ్ మోహియుద్ధీన్ అనే వ్యక్తి జార్జియాలో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కొంత మంది దుండగలు ఆరిఫ్ తో గొడవకు దిగి కత్తులతో పొడిచి పారిపోయారు. స్థానికులు ఆరిఫ్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ...
చంచల్ గూడకి చెందిన 37 ఏళ్ళ మహమ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్ గత పదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. జార్జియాలో గ్రోసరీ స్టోర్స్ నడుపుతున్నాడు. ఆరిఫ్‌కు భార్య, పది నెలల పాప ఉన్నారు. బిజినెస్ పార్టనర్ తో విభేదాలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.షాపు మూసివేసి అరగంటలో ఇంటికి వస్తానని చెప్పిన తన భర్త, ఫోన్ చేసినా ఎత్తలేదని ఫాతిమా తెలిపింది. స్నేహితుల ద్వారా భర్త మరణవార్త తెలిసినట్టు వెల్లడించింది. భర్తని కడసారి చూసేందుకు అవకాశం కల్పించాలని కోరింది.
జార్జియా పోలీసులు ఆరిఫ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అత్యవసర వీసాకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఆరిఫ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అమెరికాలో తమకు బంధువులు లేరని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది ఆరిఫ్‌కు ఫోన్ చేశానని భార్య ఫాతిమా తెలిపింది. 30 నిమిషాల తరువాత కాల్ చేస్తానని చెప్పి ఫోన్ చేయలేదని తన భర్త మరణవార్త భావ ద్వారా తెలిసిందన్నారు. ఆరిఫ్ అంతిమ సంస్కారాలు హాజరయ్యేందుకు ఆయన కుటుంబ సభ్యులకు వీసా ఇప్పించాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో పాటు ఆమెరికా రాయబారి కార్యాలయానికి ఎంబిటి పార్టీ లేఖ రాసింది. ఎమర్జెన్సీ వీసాతో పాటు టికెట్ కూడా ఇప్పించి అంతిమయాత్రలో పాల్గొనే విధంగా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.