Begin typing your search above and press return to search.
అక్క చెల్లెళ్ళ మధ్య వివాదాలు పెరిగిపోయాయా ?
By: Tupaki Desk | 6 Feb 2021 3:30 PM GMTభూమా సిస్టర్స్ మధ్య వివాదాలు పెరిగిపోయాయా ? అసలు ఇద్దరు మాట్లాడుకోవటం లేదా ? వివిధ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. దాదాపు రెండు నెలలుగా సిస్టర్స్ భూమా అఖిలప్రియ, భూమా మౌనికారెడ్డి మధ్య దాదాపు మాటలు లేవని సమాచారం. కుటంబ ఆస్తులను పంచుకోవటంలోను, ఆస్తులు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు పంపిణీలోను ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో గొడవలు జరుగుతున్నాయట.
నిజానికి భూమా కుటుంబంలో అక్క-చెల్లెలు-తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి మధ్య తీవ్రస్ధాయిలోనే ఆస్తి తగాదాలు నడుస్తున్నాయట. కొన్ని ఆస్తులను అమ్మేసిన అఖిల తద్వారా వచ్చిన డబ్బును చెల్లెలు, తమ్ముడికి న్యాయబద్దమైన వాటాలు పంచలేదనే ప్రచారం జరుగుతోంది. మొత్తం ఆస్తులను, నగదు తదితరాలను అఖిల తన గుప్పిట్లో పెట్టుకున్నదనే కోపం మౌనికలో బాగా పెరిగిపోయిందట.
ఆస్తుల పంపిణీ విషయంలో అఖిలపై మౌనిక కేసు కూడా వేద్దామని డిసైడ్ అయిపోయిందట. అయితే బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల అరెస్టవ్వటంతో కోర్టులో కేసు వేసే విషయాన్ని వాయిదావేసిందట. ఆస్తుల గొడవను పరిష్కరించుకునే ఉద్దేశ్యంతోనే సోదరి అఖిలను జైలులో నుండి బయటకు తీసుకురావటానికి చెల్లెలు ప్రయత్నించినట్లు సమాచారం.
జైలులో అఖిల ఉన్నపుడు ఆమెకు మద్దతుగా మౌనిక ఎంతగా మాట్లాడిందో అందరు చూసిందే. అయితే బెయిల్ తీసుకుని అఖిల బయటకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ చెల్లెలు ఇప్పటివరకు కలవనే లేదట. దాంతో అఖిల ఒంటరిగానే హైదరాబాద్ నుండి నంద్యాలకు వెళ్ళిపోయినట్లు సమాచారం. మొత్తానికి కుటుంబానికింతా దక్కాల్సిన ఆస్తులను, వాటాలను అఖిలప్రియ+భర్త భార్గవరామ్ మాత్రమే గుప్పిట పెట్టుకున్నట్లు చెల్లెలు, తమ్ముడు మండిపోతున్నారట. చూద్దాం చివరకు ఏమవుతుందో.