Begin typing your search above and press return to search.
లోకేష్ ఎంట్రీ.. టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
By: Tupaki Desk | 24 Oct 2020 12:10 PM GMTఅధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ దే అంతా చెల్లింది. ఆయన పర్యటనలకు వస్తే టీడీపీ శ్రేణులంతా నీరాజనం పలికేవారు. కానీ ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది. ప్రతిపక్షంలో నారా లోకేష్ వస్తే విభేదాలు ఎక్కువ అవుతున్నాయి.
తాజాగా నారా లోకేష్ అనంతపురం పర్యటన టీడీపీలో చిచ్చుపెట్టింది. లోకేష్ అనంతపురం వచ్చి కేవలం జేసీ కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.. లోకేష్ వెంట ఉండి జేసీ పవన్, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిలు వేరే ఏ టీడీపీ నేతను దగ్గరకు రానీయకపోవడంతో నేతలు భగ్గుమన్నారని ప్రచారం సాగుతోంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, ఉన్నం హనుమంత రాయచౌదరి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు లోకేష్ పర్యటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు టాక్. ఇదే బాటలో మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాస్ కూడా ఉన్నట్టు సమాచారం.
2014 దాకా కాంగ్రెస్ లో ఉండి టీడీపీని అణిచివేసిన జేసీ కుటుంబానికి నారా లోకేష్ అత్యంత ప్రాధాన్యతం ఇవ్వడంపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారట.. జేసీ ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తే తాము వైదొలుగుతామంటూ సీనియర్ మథనపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి వర్గం లోకేష్ తీరుపై గుర్రుగా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తేల్చుకుంటామని ప్రకటించడంతో అనంతపురం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.