Begin typing your search above and press return to search.

అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేశా - ఎర్రబెల్లి

By:  Tupaki Desk   |   26 April 2019 4:34 PM GMT
అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేశా - ఎర్రబెల్లి
X
తెలంగాణలో టీడీపీకి మంచి ఓటు బ్యాంక్‌ ఉంది. తెలంగాణలో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చినా కూడా ఖమ్మంలో టీఆర్‌ ఎస్‌ కు చుక్కలు చూపించింది అంటే దానికి కారణం.. బలమైన ఓటు బ్యాంక్‌ - క్యాడర్‌ ఉండడమే. ఇలాంటి బలమైన క్యాడర్‌ టీడీపీకి రావడానికి కారణం.. ప్రతి జిల్లాకు ఒక అద్భుతమైన నాయకుడు ఉండడమే. ఖమ్మం జిల్లాకు నామా - తుమ్మల ఎలాగో.. అలాగే వరంగల్‌ జిల్లాకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఉన్నారు. వరంగల్‌ జిల్లాలో టీడీపీ అప్రతిహతంగా దూసుకుపోయిందంటే.. దానికి కారణం ఎర్రబెల్లే. అలాంటి ఎర్రబెల్లి కూడా టీడీపీని వదిలి టీఆర్‌ ఎస్‌ లో చేరిపోయారు. మంత్రి అయ్యారు.

మంత్రి అయిన కొత్తలో.. తనకు గతంలో మంత్రి పదవి రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని.. అందుకే తాను సీనియర్‌ ని అయినా కూడా తనకు ఇన్నాళ్లు మంత్రి పదవి రాలేదని ఆరోపణలు చేశారు ఎర్రబెల్లి. సో.. మంత్రి పదవి కోసమే ఎర్రబెల్లి టీఆర్‌ ఎస్‌ లోకి వచ్చారని అందరూ అనుకున్నారు. దీంతో.. ఇప్పుడు ఎర్రబెల్లి మళ్లీ మాట మార్చారు. టీడీపీ తెలంగాణలో దాదాపు భూస్థాపితం అయిపోయిందని.. ఇప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి కూడా అలాగే ఉందని అన్నారు. ఇలాంటి సమయంలో.. ఇలాంటి టీడీపీలోనో - కాంగ్రెస్‌ లోనే ఉంటే.. రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందని.. అందుకే టీఆర్‌ ఎస్‌ లో చేరినట్లు ప్రకటించారు ఎర్రబెల్లి దయాకరరావు. మొత్తానికి అసలు తాను ఎందుకు పార్టీ మారాల్సివచ్చిందో చాలా స్పష్టంగా చెప్పారు ఎర్రబెల్లి.

ఎర్రబెల్లి లాంటి లీడర్‌ టీఆర్‌ ఎస్‌ కు చాలా అవసరం. దాదాపు 30 సంవత్సరాల పాటు ఒకే పార్టీలో కమిటెడ్‌ గా ఉన్నారు. అన్నింటికి మించి పార్టీకి విధేయుడిగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి పేరున్న ఎర్రబెల్లి టీఆర్‌ ఎస్‌ లోకి వస్తే.. క్యాడర్‌ మరింతగా బలపడుతుందని కేసీఆర్‌ అంచనా. అందుకే ఏరికోరి మరి ఎర్రబెల్లిని పార్టీలోకి తీసుకొచ్చి మంత్రిపదవి కూడా ఇచ్చి గౌరవించారు.