Begin typing your search above and press return to search.

మాకు చూపించాకే `ఇందు స‌ర్కార్‌` సెన్సార్!

By:  Tupaki Desk   |   5 July 2017 9:53 AM GMT
మాకు చూపించాకే `ఇందు స‌ర్కార్‌` సెన్సార్!
X
మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ హ‌యాంలో విధించిన ఎమ‌ర్జెన్సీ నేప‌థ్యంలో `ఇందు స‌ర్కార్‌` తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. 1975-77 నాటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులను క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్‌. ఈ మ‌ధ్య‌నే విడుద‌ల‌యిన `ఇందు స‌ర్కార్‌` ట్రైల‌ర్ కు నాలుగు మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచ‌నాలున్నాయి.

అయితే, ఈ సినిమాపై కాంగ్రెస్ నాయ‌కుడు సంజ‌య్ నిరుప‌మ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీ, సంజ‌య్ గాంధీలను అగౌరవనీయ రీతిలో చూపించే అవ‌కాశం ఉంద‌ని ఆరోపించారు. అందుకే సెన్సార్ చేయ‌క‌ ముందే త‌మ‌కు ఆ సినిమాను ఒక‌సారి చూపించాల‌ని సెన్సార్ బోర్డ్ చైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహ్లానీకి ఆయ‌న లేఖ రాశారు.

`ఇందు స‌ర్కార్‌`ఈ నెల‌ 28న విడుద‌లకు సిద్ధ‌మైంది. ఈ సినిమాలో ఇందిరా గాంధీగా సుప్రియా వినోద్‌ - సంజ‌య్ గాంధీగా నీల్ నితిన్ ముఖేశ్‌లు నటించారు. దేశ వ్యాప్తంగా ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో జ‌రిగిన అక్ర‌మాలు - రాజ‌కీయ కుట్ర‌లు - వాటి ప‌ర్య‌వ‌సానాల‌ను ఈ సినిమాలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించ‌నున్నారు. ఈ లేఖ‌పై మాధుర్ భండార్క‌ర్ స్పందించారు. సెన్సార్ కంటే ముందు ఇత‌రుల‌కు సినిమాను ప్ర‌ద‌ర్శించే ప్ర‌స‌క్తే లేద‌ని, సినిమా విడుద‌ల‌కు ముందు ఇలాంటి వివాదాలు స‌హ‌జ‌మేన‌ని అన్నారు.