Begin typing your search above and press return to search.
విపక్షాలు కోరుకున్న వారే సభలో ఉండాలా?
By: Tupaki Desk | 4 Dec 2015 8:09 AM GMTతప్పులు చేస్తే శిక్షలు ఎవరు వేయాలి? అన్నది దేశంలో ఉన్న చట్టాల్లో స్పష్టంగా ఉంది. ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఎవరు ఏ తప్పు చేస్తే వారిపై నేరారోపణ నమోదు మొదలు.. శిక్ష వరకూ చాలానే నియమనిబంధనలు ఉన్నాయి. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నయి విపక్షాలు. కేంద్రమంత్రి వీకే సింగ్ దళితులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఇక్కడ వీకే సింగ్ తప్పుచేశారా? రైటు చేశారా? అన్న విషయాన్ని తేల్చాల్సిన న్యాయస్థానాలకు భిన్నంగా.. విపక్షాలు కలిసికట్టుగా కేంద్రమంత్రిని రాజ్యసభకు రానివ్వొద్దంటూ నిరసన వ్యక్తం చేయటం విచిత్రంగా మారింది.
దారుణమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి సైతం న్యాయసహాయం అందాలని.. ఆ వ్యక్తి తరఫు న్యాయవాది వాదించేలా ఏర్పాట్లు దేశంలో ఉన్నాయి. కానీ.. అందుకు భిన్నంగా విపక్షాలు తాము కోరుకున్న వారే సభలో ఉండాలన్నట్లుగా వ్యవహరించటం విపరీత మనస్తత్వానికి నిదర్శనంగా చెబుతున్నారు. దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ విపరీతమైన ఆందోళన వ్యక్తం చేసే వారు.. రాజ్యసభలో సభ్యులు తమకు తోచినట్లుగా.. తనకు నచ్చిన రీతిలో సభ జరగాలని భావించటంలో అర్థం ఏమిటి?
నిజంగా వీకే సింగ్ తప్పు చేస్తే.. చట్టబద్ధంగా ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది న్యాయస్థానం. అంతే తప్ప.. తప్ప చేశారంటూ సభ్యుడ్ని సభలోకి రానివ్వమంటూ మాట్లాడటం దేనికి నిదర్శనం. వివిధ నేరారోపణ ఉన్న వారు సైతం దర్జాగా సభలో కూర్చొని వెళుతుంటే.. కేంద్రమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఈ స్థాయిలో విరుచుకుపడటం ఏమిటన్నది ఇప్పుడు వచ్చే ప్రశ్న. ఇలా ఎవరికి వారు.. తమకు నచ్చినోళ్లు మాత్రమే సభలోఉండాలని.. మిగిలిన వారు సభకు రాకూడదంటూ పట్టుబట్టటంలో అర్థం ఉందా? అన్నది ప్రశ్న. ఇలాంటి అప్రజాస్వామిక విధానాల్ని విపక్ష సభ్యులు చేయటం.. అది కూడా పెద్దల సభగా వ్యవహరించే రాజ్యసభలో చోటు చేసుకోవటం దురదృష్టకర సంఘటనగానే చెప్పాలి. కేంద్రమంత్రి వీకే సింగ్ ను రాజ్యసభలోకి రానివొద్దంటూ విపక్షాలు విరుచుకుపడటం అసహనానికి సరికొత్త రూపం కాదా? అన్నది ఇప్పుడొచ్చే సందేహం.