Begin typing your search above and press return to search.
శశిథరూర్ పై కాంగ్రెస్ యాక్షన్ షురూ
By: Tupaki Desk | 20 Oct 2022 3:06 PM GMTకాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయిన సీనియర్ నేత శశిథరూర్ పై యాక్షన్ మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే దాదాపు 8వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన వేళ శశిథరూర్ పోలింగ్ లో భారీగా యూపీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ మథుసూదన్ మిస్త్రీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని మీడియాకు లీక్ చేశారు.దీన్ని వాడుకుంటూ బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నారని ఆరోపించింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. వ్యవస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ దీనిపై శశిథరూర్ పై సీరియస్ అయ్యింది. శశిథరూర్ ను వివరణ అడగగా.. ‘సారీ లెటర్ లీకైంది.. వదిలేయండి’ అంటూ కాంగ్రెస్ కు వివరణ ఇచ్చాడు. కానీ కాంగ్రెస్ మాత్రం వదలలేదు. పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ మిస్త్రీ తీవ్రంగా స్పందించారు.
శశిథరూర్ పార్టీ వద్ద ఒకలా.. మీడియాలో మరోలా వ్యవహరించారని.. తాము మీ ఫిర్యాదులను అంగీకరించినా మీరు కేంద్ర ఎన్నికల అథారిటీ మీపై కుట్ర పన్నిందని ఆరోపిస్తూ మీడియా ముందుకొచ్చారని మిస్త్రీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
137 ఏళ్ల చరిత్రగల పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే .. పోటీగా శశిథరూర్ ఈ ఎన్నికల్లో నిలబడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్లు ఖర్గే , పీసీసీ ప్రతినిధుల మెప్పు పొందే ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. రెబల్ గా అధిష్టానానికి వ్యతిరేకంగా పోటీచేసిన శశిథరూర్ చిత్తుగా ఓడారు.
మొదటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గే వివాదరహితుడు అనే పేరు ఉంది. దళిత వర్గానికి చెందిన నేత కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్ కాంగ్రెస్ లో ఉన్న తెలివైన నాయకుల్లో ఒకరు.
అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కొద్ది కాంగ్రెస్ నాయకుల్లో థరూర్ ముందున్నారు. కానీ అసమ్మతి రాజేయడమే ఆయనకు మైనస్ గా మారింది. అధిష్టానానికి నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీచేయడమే ఓటమికి కారణమైంది. ఇప్పుడు ఎన్నికల్లో అక్రమాలతోనే ఓడిపోయానని మరో వివాదాన్ని రాజేస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి సాగనంపే చర్యలను కాంగ్రెస్ చేపట్టింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.