Begin typing your search above and press return to search.

గాలి వారింట పెళ్లికి ఆ నేతలు వెళ్లరట!!

By:  Tupaki Desk   |   15 Nov 2016 6:34 AM GMT
గాలి వారింట పెళ్లికి ఆ నేతలు వెళ్లరట!!
X
తమ ఇంట జరిగే పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలని కలలు కంటున్న ఐరన్ ఓర్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సొంత పార్టీ నేతలు షాకివ్వనున్నట్లు చెబుతున్నారు. కర్ణాటక బీజేపీ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు చిన్నమ్మగా సుపరిచితురాలైన సుష్మా స్వరాజ్ తో చక్కటి సంబంధాలు ఉన్నాయి. తమ ఇంట నిర్వహించే పండగలకు సుష్మా స్వరాజ్ స్వయంగా హాజరు కావటం తెలిసిందే. అక్రమ మైనింగ్ కేసుల్లో పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన గాలి జనార్దన్ ఇంట జరిగే పెళ్లికి బీజేపీ నేతలు దూరంగా ఉండాలని అధినాయకత్వం నుంచి అనధికారిక ఆదేశాలు అందినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం నోట్ల రద్దు వ్యవహారంతో పాటు.. నల్లధనంపై పోరాటం చేస్తున్నట్లుగా ప్రధాని మోడీ చెబుతున్న వేళ.. అందుకు భిన్నంగా గాలి వారింట జరిగే పెళ్లికి హాజరైతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాలి వారింట జరుగుతున్న పెళ్లికి దూరంగా ఉండాలంటూ బీజేపీ అగ్రనాయకత్వం పార్టీ నేతల్ని కోరినట్లుగా తెలుస్తోంది.

అదేసమయంలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా గాలి వారింట పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తన కుమార్తె వివాహాన్ని భారీగా జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు నేతల్ని ఈ పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లి పిలుపుల సమయానికి.. ప్రస్తుతానికి వచ్చిన మార్పుల నేపథ్యంలో నల్లధనంపై పోరాటం చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు గాలి వారింట పెళ్లికి వెళితే తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. గాలి వారింట పెళ్లికి రాజకీయ ముఖ్యులు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/