Begin typing your search above and press return to search.
కాంగ్రెస్.. కమ్యూనిస్టులు కలిసిపోయారు
By: Tupaki Desk | 8 March 2016 5:51 AM GMTరాజకీయాల్లో నానుడికి తగ్గట్లే.. ఏమాత్రం పొసగని రెండు పార్టీల మధ్య మరోసారి బంధం చిగురించింది. యూపీఏ 1లో కాంగ్రెస్ తో చట్టాపట్టాలు వేసుకున్న కమ్యూనిస్ట్ లు తర్వాతకాలంలో ఆ పార్టీతో విభేదించి.. విడిపోయి తమకు తాముగా ఉండిపోవటం తెలిసిందే. తాజాగా తమ ఉమ్మడి శత్రువైన మోడీని దెబ్బ తీసేందుకు వీలుగా.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఒకటి ఖరారైంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రేసులో కాంగ్రెస్.. కమ్యూనిస్టులు కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించారు. తమ మధ్య కుదిరింది పొత్తుమాత్రమేనని.. ఇదేమీ అవగాహన కాదంటూ కమ్యూనిస్టు నేతలు స్పష్టం చేస్తున్నారు. కలిసి పోటీ చేస్తున్నప్పటికీ ప్రచారం పంచాయితీ మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీనే చేస్తుందని.. ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయమని.. ఉమ్మడిగా కలిసి ఒకే వేదికను పంచుకునే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. కలిసి పోటీ చేస్తారు కానీ.. కలిసి మాత్రం ప్రచారం చేయమని చెప్పటం ఏమిటో.. కాంగ్రెస్.. కమ్యూనిస్టులకు మాత్రమే అర్థం కావాలి. వీరిద్దరి వ్యవహారం చూస్తే.. తమ తమ రాజకీయ అవసరాల కోసం ఒకరినొకరు వాడుకుంటున్న ఈ రెండు పార్టీలు.. జనాలకు మాత్రం పంగనామాలు పెడుతున్నారనే చెప్పక తప్పదు.