Begin typing your search above and press return to search.

కన్నడ సంక్షోభం ఖర్చెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   14 July 2019 12:29 PM IST
కన్నడ సంక్షోభం ఖర్చెంతో తెలుసా?
X
కన్నడ సంకీర్ణ ప్రభుత్వం కాపాడుకోవడానికి పార్టీలు పెడుతున్న ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అధికార కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు 14మంది రాజీనామా చేసి ముంబై హోటల్ లో బస చేశారు. అక్కడి నుంచి బెంగళూరు వచ్చి రిసార్ట్ లకు వెళ్లారు.

ఇక కాంగ్రెస్ - జేడీఎస్ లు విడివిడిగా రిసార్ట్ లకు తరలించాయి. జేడీఎస్ ఎమ్మెల్యేలు 33 మందిని నగర శివార్లలోని రిసార్ట్ కు తరలించారు. వారి ఖర్చు అక్షరాల రూ.2 కోట్లు దాటినట్టు సమాచారం. ఇక బీజేపీ కూడా తన ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించింది. ఈ మూడు రోజుల ఖర్చు ఏకంగా 1.15 కోట్లు అంట.. మూడు రోజుల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు రాజనకుంట రిసార్ట్ లో 70మంది ఉంటున్నారు. మరో రిసార్ట్ లో 20మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్కో రిసార్ట్ లో ఒక్కొక్కరికి 30వేల ఖర్చు వస్తోందట.. టిఫిన్ - భోజనం - మందు - ఇతర అవసరాలకు అదనంగా చార్జ్ చేస్తున్నారు. మొత్తం ఒక్కరోజుకే బీజేపీ ఎమ్మెల్యేలకు ఏకంగా 40 లక్షల వరకూ ఖర్చు అవుతోందట..

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రిసార్ట్ లు దొరకకపోవడంతో వారిని యశవంతపురం సమీపంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ మకాం వేశారు. వీరికి ఒక్కొక్కరికి రూ.15వేల ఖర్చు అవుతోందట..

సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమవుతుండడంతో పార్టీలన్నీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం భారీగా ఖర్చు చేస్తూ రిసార్ట్ లో వారికి సర్వ భోగాలు, రాచమర్యాదలను చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్, జేడీఎస్ సీనియర్లు తమ ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ ఆశ చూపుతూ జారిపోకుండా చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మధ్యప్రదేశ్ సీఎం కూడా బెంగళూరు వస్తుండడం విశేషం.