Begin typing your search above and press return to search.
తాజ్ కృష్ణ.. నోవాటెల్ బిల్లు ఎంతంటే?
By: Tupaki Desk | 19 May 2018 4:35 AM GMTకొచ్చికి చేరాల్సిన కర్ణాటక రాజకీయం హైదరాబాద్ కు షిఫ్ట్ కావటం తెలిసిందే. శనివారం ఉదయానికి బస్సుల్లో.. పదుల సంఖ్యల్లో వచ్చిన కారులు స్టార్ హోటళ్ల ముందు బారులు తీరాయి. రాత్రికి రాత్రి వంద రూముకు పైనే బుక్ చేయటం.. పెళ్లి బుకింగ్ కాస్తా.. బలపరీక్షకు సిద్ధమయ్యే నేతల్ని దాచి పెట్టేందుకు కావటం ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక నుంచి తీసుకొచ్చిన ప్రత్యేకమైన ప్రైవేటు సెక్యురిటీ హోటల్ ను కమ్మేశారు. లోపలికి వెళ్లే వారి విషయంలో ఆచితూచి అన్నట్లుగా చూశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం తాజ్ కృష్ణాలో అయితే.. కాంగ్రెస్ నేతల్ని ఒక ఫ్లోర్ లో ఉంచేయటమే కాదు.. ఆ ఫ్లోర్ కు వెళ్లే రెండు లిఫ్ట్ లలో ఒక దానికి మాత్రమే యాక్సిస్ ఇచ్చారట. నోవాటెల్ లోనూ ఇదే తరహాలో ప్రత్యేకంగా చూసుకున్నారట. నాలుగైదు రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం తప్పదనుకున్న దానికి భిన్నంగా సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో వెనువెంటనే బెంగళూరుకు బయలుదేరాల్సి వచ్చింది.
కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజ్ కృష్ణలో బస చేయగా.. జేడీఎస్ నేతలు మాత్రం మాదాపూర్ లోని నోవాటెల్ లో ఉన్నారు. ఈ రెండు పార్టీల నేతలు శుక్రవారం రాత్రి10.30 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు.ఒక రోజు.. ఆ మాటకు వస్తే 13 గంటల పాటు హోటల్లో ఉన్న దానికి భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసి తాజ్ కృష్ణలో సుమారు రూ.26లక్షల బిల్లు కాగా.. నోవాటెల్ బిల్లు రూ.19 లక్షల మేర అయినట్లుగా తెలుస్తోంది. నోవాటెల్ బిల్లును జేడీఎస్ నేతలు చెల్లించినట్లుగా సమాచారం. తాజ్ కృష్ణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల బసను తెలంగాణ కాంగ్రెస్ నేతలు దగ్గరుండి చూసుకోవటమే కాదు.. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు తాజ్ కృష్ణకు బారులు తీరి.. వారికి అతిధి మర్యాదల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు.