Begin typing your search above and press return to search.
కర్ణాటక రాజకీయంలో మరో మలుపు..మళ్లీ సంకీర్ణ ప్రభుత్వమేనా ?
By: Tupaki Desk | 3 Dec 2019 9:59 AM GMTమొన్నటివరకు దాదాపుగా నెలరోజులకు పైగా మహారాష్ట్ర రాజకీయం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అధికారం కోసం బీజేపీ - శివసేన తగ్గకపోవడంతో సుమారుగా నెలకి పైగా రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఆ తరువాత వ్యూహాత్మకంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ..ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ బెట్టు విడవకపోవడం తో బీజేపీ ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోయింది. దీనితో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. అలాగే మహారాష్ట్ర సీఎం గా ఉద్దవ్ థాక్రే ప్రాణాస్వీకారం చేసారు. ఇక అక్కడితో మహారాష్ట్ర ఉత్కంఠతకి తేరా పడింది అని అనుకుంటే ..తాజాగా కర్ణాటక రాజకీయంలో మరో ఉత్కంఠ మొదలైంది.
ప్రస్తుతం కర్ణాటకలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ - జేడీఎస్ నుండి బయటకి వెళ్లి బీజేపీ కి 17 మంది మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వారి పై అనర్హత వేటు వేయడంతో ..ఆ 17 స్థానాలకు ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలో బీజేపీ కనీసం 8కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి - ఆలా కాకుండా తక్కువ స్థానాలు వస్తే ప్రభుత్వానికి శాసనసభలో మెజారిటీ పోయి మళ్లీ అధికారానికి దూరం కావాల్సిందే.
ప్రస్తుతం జేడీఎస్ - కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నా ..ఫలితాల తరువాత మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత డి.కె.శివకుమార్ - జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామిలు సోమవారం అనూహ్యంగా బేటీ అయ్యారు. ఏకంగా గంటపాటు రహస్యంగా చర్చించుకున్నారు. దీనితో ఈ చర్చ పై రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
తాజాగా మల్లికార్జున ఖర్గే - సోమవారం కె.సి.వేణుగోపాల్ లు సైతం మరో వారం రోజుల్లో తీపికబురు ప్రకటిస్తామని అందుకు తగినన్ని సీట్లు సాధిస్తామని ప్రకటించారు. వీరి ప్రకటనల వెనుక కాంగ్రెస్ - జేడీఎస్ మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యం కానుంది. సర్కార్ కూలిపోనుందనే దేవేగౌడ వ్యాఖ్యలు - తీపి కబురు వినిపిస్తామనే కాంగ్రెస్ ప్రముఖుల ప్రకటనలను బట్టి మరోసారి సంకీర్ణ ప్రభుత్వానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ , ఈసారి ముఖ్యమంత్రి పదవిని కుమారస్వామి కోరుకోవడంలేదని సమాచారం. కాంగ్రెస్ నుంచి డి.కె.శివకుమార్ ముఖ్యమంత్రి అయితే తన మద్దతు ఉంటుందని దేవేగౌడ అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఈ ఇద్దరు కలవడంతో రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా డి.కె.శివకుమార్ పట్ల ప్రత్యేక అభిమానం తో ఉన్నారు. మరోవారం రోజులలో రాజకీయాలు ఎలా మారుతాయనేది ఫలితాల తర్వాత తేలనుంది.