Begin typing your search above and press return to search.
పార్టీ పుట్టనే లేదు.. అప్పుడే పొత్తుల మంతనాలు
By: Tupaki Desk | 15 Jan 2018 8:06 AM GMTతెలంగాణ రాజకీయాలు ఎన్నికలకు ముందే సిద్ధం అయిపోతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంవత్సరం తన పనుల ఎజెండాను మొత్తం పార్టీని బలోపేతం చేయడానికే వెచ్చించబోతున్నట్లుగా ముందుగానే ప్రకటించేశారు. దానికి తగినట్లుగానే కేసీఆర్ వ్యతిరేక పక్షాలు కూడా గేరప్ అవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఒక నవీన శక్తిగా రాజకీయ ఐకాస వారి రాజకీయ పార్టీ ఆవిర్భవించడం తథ్యం అనే సంకేతాలు కూడా వచ్చేశాయి. ఫిబ్రవరినెలలో ఐకాస స్థాపించబోయే రాజకీయ పార్టీ తెరమీదకు వస్తుంది. అయితే కొత్త ట్విస్టు ఏమిటంటే.. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో పుట్టే ఆ పార్టీ ఇంకా పురుడుపోసుకోలేదు.. అప్పుడే వారితో పొత్తులు కలిపేసుకోవడానికి మంతనాలు మాత్రం మొదలైపోయాయని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల విషయంలో చాలా పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్థితులోనూ కేసీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి తమ సర్వశక్తులు ఒడ్డాలని వారు ప్రయత్నిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదనేది వారి నిర్ణయంగా ఉంది. కేసీఆర్ వ్యతిరేక ఓటులో వీసమెత్తు చీలిక రాకుండా చూసుకున్నట్లయితే.. అదే తమ విజయానికి బాటలు వేస్తుందని కూడా వారు భావిస్తున్నట్లు సమాచారం. పార్ట హైకమాండ్ నుంచి ఆదేశాలు కూడా తదనుగుణంగానే ఉన్నాయి. గుజరాత్ తమ పార్టీ మెరుగ్గా సీట్లు సాధించడానికి దోహదం చేసిన సిద్ధాంత అదేనని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం లేకుండా చూడాలని రాహుల్ నుంచి రాష్ట్ర నేతలకు కూడా వర్తమానం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు చాలానే ఉన్నాయి. వీరిలో బలం తక్కువే అయినా.. నిర్దిష్టమైన ఓటు బ్యాంకు కలిగి ఉండే తెలుగుదేశంతో గానీ.. రాష్ట్రవ్యాప్తంగా తమకంటూ సొంత అస్తిత్వం కలిగి ఉన్న భాజపాతో కానీ కాంగ్రెస్ కలిసి నడవడం కల్ల. అలాంటి నేపథ్యంలో తతిమ్మా పార్టీల్లో ఎందరితో వీలైతే అందరితో పొత్తులు పెట్టుకోవాలనేది వారి ఆలోచన. ప్రొఫెసర్ కోదండరాం పార్టీ పెడితే గనుక.. వారు అడిగినన్ని సీట్లు ఇచ్చేసి.. పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎటూ కోదండరాంకు కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. ఒక దశలో ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే పుకార్లు కూడా వచ్చాయి. అలాంటి నేపథ్యంలో ఆయనతో కాంగ్రెస్ పొత్తు సులువుగానే మెటీరియలైజ్ కావొచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.