Begin typing your search above and press return to search.
పాపం.. జెండా మోసినోళ్లు 'అధ్యక్షా' అనలేరు..
By: Tupaki Desk | 12 Oct 2018 11:41 AM GMTరాజకీయాల్లో ఎవరైనా ఏం ఆశించి వస్తారంటే.. ఠక్కున వచ్చే సమాధానం పదవుల కోసం. ఎప్పటి నుంచో పార్టీల్లో కార్యకర్తలా జెండాలు మోసి నాయకుడిగా మారి బలగాన్ని ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే లేదా ఎంపీ టిక్కెట్ ఆశించడం సహజం. కానీ, మధ్యలో వచ్చిన నేతలు ఆశించిన టిక్కెట్టు తన్నుకుపోతుంటే ఆ బాధ వర్ణనాతీతం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే జరుగుతోంది. ఇక్కడ మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పార్టీల్లో కార్యకర్త స్థాయి నుంచి జిల్లా అధ్యక్ష స్థానం వరకు ఎదిగి పార్టీ టిక్కెట్ ఆశించిన వారికి ఆశాభంగం ఈ సారి కూడా తప్పలేదు. పార్టీలో చేరిన ఓ నాయకుడి వల్ల ఒకరికి - కొత్తగా చేరిన వారితో మరొకరి రూపంలో ‘అధ్యక్షా’ అనే అవకాశం కోల్పోవాల్సి వచ్చింది.
టీఆర్ ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తక్కళ్లపళ్లి రవీందర్ రావు విషయానికి వస్తే.. తెలంగాణ ఉద్యమ సమయంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం నడిపిన నేపథ్యం ఈయనిది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సారి ఎమ్మెల్యేగా పాలకుర్తి నుంచి పోటీ చేద్దామని భావించారు. అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్నారు. అయితే, ఇటీవల పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి టిక్కెట్ ను ఎగరేసుకుపోయారు. అయితే, కార్పొరేషన్ పదవి లేదా ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు హామీ దొరకడంతో సైలెంట్ అయిపోయారు.
అలాగే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిది కూడా ఇలాంటి పరిస్థితే. ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఊపు తగ్గినా - ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఎప్పటి నుంచో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నా, ఇప్పటి వరకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఈ సారి ఎలాగైనా వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ, ఇటీవల పార్టీలో చేరిన కొండపల్లి దయాసాగర్ - మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ - రేవంత్ రెడ్డితో పాటు పార్టీలోకి వచ్చిన వేం నరేందర్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో నాయిని రాజేందర్ రెడ్డికి పార్టీ టిక్కెట్ దక్కడం కష్టసాధ్యంగా మారింది.
వీరికే కాక, చాలా మంది జిల్లా అధ్యక్షులదీ ఇదే సీన్ నెలకొని ఉంది. ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకొని కాపాడుకుంటూ వచ్చిన వారికి చివరకు మొండిచేయే మిగులుతుంది. ఇంకా కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో జిల్లా అధ్యక్షులు కొంత మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక వేళ పార్టీ టిక్కెట్ దొరుకుతుందేమోనని ఆశ పడుతున్నారు. దొరకని వారు నిరాశలో మునిగిపోతున్నారు.