Begin typing your search above and press return to search.
కేసీఆర్ గండికోట రహస్యాన్ని బద్దలు కొట్టారు..
By: Tupaki Desk | 7 May 2019 7:34 AM GMTఆశ్చర్యం.. అనూహ్యం... కాంగ్రెస్ ఆరోపణలకు.. రెండింతలు పెరిగిన కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులకు, డబుల్ అయిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులకు పొంతన సరిగ్గా సరిపోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ అఫిడవిట్ వేసిన కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆస్తులు 100 కోట్లు దాటాయి. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలందరి ఆస్తులు 50శాతం పెరిగాయి.. 2014 అఫిడవిట్ తో పోల్చితే రెండింతలు అయ్యాయి. ఎలా పెరిగాయి.. ఎందుకు పెరిగాయి.. అసలు మతలబు ఏంటి.? ఈ ప్రశ్నలు అడుగుతున్నది ఎవరో కాదు.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గూడూర్ నారాయణ్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఫ్యామిలీ, టీఆర్ ఎస్ ఎమ్మెల్యే 2014, 2018 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల లెక్కలను తీసి అందరి దిమ్మదిరిగే వాస్తవాలను బయటపెట్టింది. ఇప్పుడీ నిజాలు తెలంగాణలో సంచలనంగా మారాయి.
ఇటీవల కేసీఆర్ పాటు టీఆర్ ఎస్ బడా ప్రజాప్రతినిధులపై ఐటీ నోటీసులు ఇచ్చిందన్న వార్త ప్రముఖంగా వ్యాప్తిలోకి వచ్చింది. అయితే దీనిపై ఎవరూ పెద్దగా స్పందించింది లేదు. అయితే కాంగ్రెస్ దీనిపై గట్టిగానే వివరాలు సేకరించింది. వాళ్ల లెక్కలు చూశాక నిజంగానే కేసీఆర్ ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది..
2014 ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకటించిన ఆస్తులు.. ఇప్పుడు ప్రకటించిన ఆస్తులకు రెండింతలయ్యాయి. తాజాగా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువ రూ.111.54 కోట్లుగా తేలింది. కేసీఆర్ వి 23.55 కోట్లు, కేటీఆర్ ది 41.82కోట్లు, కవితది 17.91కోట్లు, హరీష్ రావుది 11.44 కోట్లు, కేసీఆర్ తోడల్లుడు కొడుకు సంతోష్ కుమార్ ది 16.80 కోట్లు. ఇలా మొత్తం విలువ 100 కోట్లు దాటింది. అదే సమయంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల సంపాదన డబులైంది. ఇంత తక్కువ టైంలో ఇంత అధిక సంపాదన ఎలా సాధ్యమైందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది..
కాంగ్రెస్ ప్రశ్నకు ఒక కారణముంది. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కు పెద్దగా పరిశ్రమలు, వ్యాపార రంగంలో కూడా లేరు.. మొత్తం మంది రాజకీయ నాయకులే.. రాజకీయంలోనే బతుకుతున్నారు.మ రి ఏ సంపాదన లేని వీరికి అంత ఆస్తులు ఎలా పెరిగాయన్నది కాంగ్రెస్ ప్రశ్న. ఈ ప్రశ్నకు గులాబీ దళం ఏం సమాధానమిస్తుందనేది వేచిచూడాలి.