Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ను ట్రోల్ చేస్తున్న బీజేపీ !
By: Tupaki Desk | 25 Jun 2022 2:30 PM GMTకాంగ్రెస్ పార్టీ తెలంగాణ రథసారథి రేవంత్ రెడ్డికి మరో టాపిక్ దొరికింది. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఆందోళన కారులకు న్యాయ సాయం చేస్తామని కాంగ్రెస్ అంటోంది. వీరంతా యువకులే కనుక వీరికి అండగా ఉంటామని కూడా అంటోంది. అదేవిధంగా వీరికి మద్దతుగా సత్యాగ్రహ దీక్షలు చేస్తామని కూడా చెబుతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు నిన్నటి వేళ అంటే శుక్రవారం ములాఖత్ అయ్యారు.
దీనిపైనే ఇప్పుడు బీజేపీ మండిపడుతోంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఏడు వందల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింప జేసిన నిరసనకారులకు ఏ విధంగా మీరు మద్దతు పలుకుతారని అంటోంది.
అగ్నిపథ్ ను వ్యతిరేకించే క్రమంలో ఎందరెందరో యువకులు ఎందరో సామాన్యులను భయ భ్రాంతులకు గురి చేశారని, విచ్ఛిన్న కర శక్తులకు మీరెలా సాయం చేస్తారని ప్రశ్నిస్తోంది. ఎక్కడి నుంచి ఇంత మంది వచ్చారని పోలీసులకు ఇప్పటికీ అంతుబట్టని విధంగానే ఉందని, విలువైన ప్రజా ఆస్తులను ధ్వంసం చేసేవారు దేశాన్ని ఎలా కాపాడుగలుగుతారని ప్రశ్నిస్తోంది.
మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. ఆర్మీలో పార్ట్ టైం రిక్రూట్మెంట్ వద్దనే అంటున్నారు. అదేవిధంగా యువకులపై నమోదయిన నాన్ బెయిల్ బుల్ సెక్షన్లను ఉపసంహరించుకోవాలని కూడా కోరుతున్నారు.
హత్యాయత్నం సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడాన్ని రేవంత్ ఖండించారు. క్షణికావేశంతో చేసిన నేరాలకు తీవ్ర శిక్షలు విధించే సెక్షన్లు నమోదు చేయడం ఏంటన్నది రేవంత్ ప్రశ్న.ఇదే సందర్భంలో బీజేపీ మాత్రం చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, ఇంకా ఈ కేసు దర్యాప్తు ముమ్మరం అవుతోందని, మరికొందరు అరెస్టు అవుతారని కూడా అంటోంది.
తాము అగ్నిపథ్ ను రాజకీయం చేయాలనుకునే పార్టీలు కాస్త నోటిఫికేషన్ ను చదివి అర్థం చేసుకోవాలని హితవు చెబుతోంది. పొలిటికల్ మైలేజ్ ను పెంచుకోవాలని చూసిన కొన్ని స్థానిక ప్రభుత్వాలకు చెందిన నాయకులు అల్లర్లకు పాల్పడిన వారికి అండగా ఉంటామని చెప్పడం విడ్డూరంగానే ఉందని బీజేపీ మండిపడుతోంది.