Begin typing your search above and press return to search.
కాంగ్రెస్, బీజేపీల స్నేహంతో వాళ్లకు కుళ్లు!
By: Tupaki Desk | 18 July 2015 4:25 AM GMTమహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల స్నేహాన్ని చూసి మిగతా పార్టీలే షాక్ అవుతున్నాయి. అందరూ రాజకీయాల్లో ఉన్నవారే అయినా.. కాంగ్రెస్, బీజేపీ రాజకీయాన్ని చూసి మాత్రం వామ్మో అంటున్నారు. ఈ తరహా రాజకీయాన్ని తామెప్పుడూ చూడలేదని అంటున్నారు. ఒక జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ లు చేతులు కలపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ అధికారంలో.. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్న రాష్ట్రంలో ఈ తరహా పొత్తు ఉండటం అత్యంత విడ్డూరం మరి.
మహారాష్ట్రలోని గోంధియా జిల్లాలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో నాలుగు పార్టీల మధ్య పోటీ జరిగింది. కాంగ్రెస్ ,బీజేపీ, శివసేన, ఎన్సీపీలు ఎవరికి వారుగా తలపడ్డాయి. ఈ రణరంగంలో తొలి స్థానంలో నేషనలిస్టు కాంగ్రెస్ నిలిచింది. ఆ పార్టీ 20 స్థానాలను సొంతం చేసుకొంది. ఆ తర్వాత కాంగ్రెస్ 17, బీజేపీ 16 స్థానాలను సొంతం చేసుకొంది. శివసేన నామమాత్రంగా గెలిచింది. మరి ఎవరికీ సొంతంగా మెజారిటీ రాని ఈ ఎన్నికల్లో వాస్తవంగా చూస్తే కాంగ్రెస్ , ఎన్సీపీలు కలిసి పరిషత్ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేదా శివసేన, బీజేపీలు కలిసి ట్రై చేయాల్సింది.
అలా కాకుండా.. ఇక్కడ ఏకంగా బీజేపీ, కాంగ్రెస్ లు చేతులు కలిపాయి. రెండు పార్టీలూ కలిసి జిల్లా పరిషత్ స్థానాన్ని సొంతం చేసుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని.. బీజేపీ డిప్యూటీ చైర్మన్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకొన్నాయి. మరి ఈ విధంగా ఆ గర్భ శత్రువుల కలయికతో అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రత్యేకించి మహారాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షం అయిన శివసేన, కాంగ్రెస్ కు మిత్రపక్షం అయిన ఎన్సీలు ఈ పరిణామంతో షాక్ నే తిన్నాయి. శివసేన తన పత్రిక 'సామ్నా'లో వ్యవహారంలో బీజేపీపై విరుచుకుపడింది.