Begin typing your search above and press return to search.
'పుష్ప' సాంగ్‌తో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం
By: Tupaki Desk | 4 Feb 2022 5:02 PM GMTఎన్నికలంటే.. సాధారణంగా నేతల ప్రసంగాలు, ప్రత్యర్థులపై విమర్శలు.. డప్పులు.. కార్యకర్తల జైజై ధ్వానాలు కామన్. అయితే.. ఇవే ఉంటే.. మజా ఏముంటుందని అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల వచ్చిన బన్నీ మూవీ పుష్పలోని శ్రీవల్లి సాంగ్‌ను రీమేక్ చేసి.. ప్యారడీగా మార్చి.. ఎన్నికల ప్రచారంలో జోరుగా వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల పాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని పాటలు, డ్యాన్సులు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. క్రికెటర్ల నుంచి పలువురు ప్రముఖుల వరకు ఆ సినిమాలోని పాటలు, డ్యాన్సులు ట్రై చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ముఖ్యంగా చూపే బంగారమాయనే.. పాటకు క్రికెటర్లు కూడా ఎడమ చేయి గూడను పైకి పెట్టి.. యాక్షన్ చేస్తున్న వీడియోలు ఇటీవల హోరెత్తించిన విషయం తెలిసిందే. ఇది బాగా వర్కవుట్ అవడంతో కాంగ్రెస్ పార్టీ ఇదే పాటను ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోంది. యూపీలో ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ తాజాగా తమ ఎన్నికల పాటను విడుదల చేసింది. యూపీ గొప్పతనాన్ని వర్ణిస్తూ రూపొందించిన ఈ పాట కోసం ‘పుష్ప’ సినిమాలో ‘చూపే బంగారామాయానే శ్రీవల్లీ..’ అనే పాట ట్యూన్‌ను తీసుకుని ప్యారెడీ కట్టించింది.
‘తూ హై గజబ్ యూపీ, తేరీ కసమ్..’ (చాలా అందంగా ఉంటావు యూపీ..) అని సాగే వీడియో సాంగ్‌ను చిత్రీకరించింది. ‘ఉత్తర ప్రదేశ్ వాసులమైనందుకు గర్వంగా ఉంది’ అన్న క్యాప్షన్‌తో యూపీ కాంగ్రెస్ ఈ పాటను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతల ఎన్నికలు ఈ నెల 10న జరుగుతాయి. మార్చి 10న ఓట్లు లెక్కిస్తారు. 2017 ఎన్నికల్లోనూ యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 410 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ, దాని మిత్ర పక్షాలు 312 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.