Begin typing your search above and press return to search.
చిరంజీవి విషయంలో కాంగ్రెస్ క్లారిటీ?
By: Tupaki Desk | 25 Aug 2021 6:30 AM GMTసినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎన్నో ఆశలతో ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించి మరీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన అనుకున్న పని సాధ్యం కాలేదు. దీంతో పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చిరకు కేంద్రమంత్రిగా సముచిత స్థానమే ఇచ్చారు. కానీ ఆ తరువాత రాను రాను చిరు రాజకీయ భవితవ్యం శూన్యమే అన్నట్లు సాగింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు, వారి ప్రవర్తనను చూస్తే చిరంజీవి ఇక కాంగ్రెస్లో లేనట్లేనని అనుకుంటున్నారు. ఆయన పార్టీలో లేరిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ ప్రకటించగా.. పార్టీలోను ఉన్నారని ఏపీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా రెండు రకాల వ్యాఖ్యలతో అయోమయం నెలకొంది.
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. సినిమాల్లో ఎన్టీఆర్ తరువాత మెగాస్టార్ చిరంజీవికి అంత పేరున్నట్లు చెప్పుకుంటారు. దీంతో తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని 2008లో ‘ప్రజారాజ్యం’ పేరుతో పార్టీని స్థాపించారు. బీసీల అబివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని నినదించారు. అయతే ఆయన పార్టీ స్థాపించిన తరువాత వచ్చిన 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు. అయితే కొన్నాళ్ల పాటు పార్టీని నడిపించిన చిరు ఆ తరువాత కాంగ్రెస్లో కలిపేశారు. దీంతో ఆ సమయంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు.
ఇక ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం.. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారడంతో చిరు ప్రాధాన్యత తగ్గిపోయింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా తూడిచి పెట్టుకుపోవడంతో ఆయన రాజకీయాల్లోకి దూరంగా ఉన్నారు. ఇక ఆ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది. తనను మెగాస్టార్ గా నిలబెట్టిన సినిమా పరిశ్రమలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిరు పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ కు మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత చిరు జగన్ ను కలవడం ఈ ప్రచారానికి బలం చూకూరినట్లయింది. ఇటీవల సినీ ఇండస్ట్రీని కాపాడాలంటూ చిరు ఏపీ సీఎం జగన్ కలిశారు. సినీ పరిశ్రమ తరుపున అప్పుడప్పుడు అటు తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ఇటు ఏపీ సీఎం జగన్ ను కలిసి వస్తున్నారు. దీంతో తాను ఏ పార్టీలో లేనట్లుగానే సంకేతాలిచ్చారు.
తాజాగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాంది చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేనట్లు ప్రకటించారు. అయితే ఏపీ కాంగ్రెస్ నాయకులు మాత్రం చిరంజీవికి మద్దతు పలికారు. ఆయన పార్టీలోనే ఉన్నారని అంటున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ చిరంజీవి కాంగ్రెస్ తోనే ఉంటారన్నారు. కొందరు ముఖ్య నాయకులు కూడా మాతోనే ఉన్నారని ప్రకటించారు. అయితే ఈ నాయకులు ఎలా చెబుతున్నా ఆయనను మిగతా పార్టీ నాయకులు దూరం పెట్టారనే అంటున్నారు.
ఇటీవల మెగాస్టార్ బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనకు విషెష్ చెప్పారు. అభిమానుల కోలాహాలం అంతా ఇంతా కాదు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చడీ చప్పుడు కాకుండా ఉన్నారు. అంతకుముందు చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి క్యూ కట్టేవారు. అయితే ఇప్పుడు కరోనా నిబంధనలు అనుకున్నా కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా చిరుకు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు చెప్పలేదు. దీంతో చిరు కాంగ్రెస్లో ఉన్నట్లా..? లేనట్లా..? అన్నచర్చ సాగుతోంది.