Begin typing your search above and press return to search.
మోడీపై ఇక.. సమరమే.. ధరలపై ప్రజల్లోకి.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 27 March 2022 1:30 AM GMTకేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని కాంగ్రెస్ నేతలు తీర్మానించారు. పోరాటాల ద్వారానే అధికారంలోకి రావాలని నిర్ణయించారు. ఇక, ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండాలని తీర్మానం చేసుకున్నారు. ప్రస్తుతం పెరిగిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను అవకాశంగా మలుచుకుని.. ప్రజలను చైతన్య పరిచి.. వారిని తమవైపు తిప్పుకోవాలని.. ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి.. ఒక సమగ్ర కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 31న గురువారం.. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్ల మీదకు రావాలని.. కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అంతేకాదు.. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినదించాలని కోరింది.
గ్యాస్ బండలకు దండలు వేసి.. చేతిలో పళ్లాలు, డ్రమ్ములుపై.. వాయించాలని.. చెవిటి బీజేపీ ప్రభుత్వానికి ప్రజల ఆవేదన అర్ధమయ్యేలా నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో దేశంలో ధరల పెరుగుదలపై కేంద్రంపై యుద్ధం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా ప్రకటించింది. తొలి రోజు దేశవ్యాప్తంగా డ్రమ్ములు.. వాయించడం.. రెండో రోజు ప్రజలు మూకుమ్మడిగా నిరసన తెలపడం.. ద్వారా.. మోడీ సర్కారుప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చింది.
మరోవైపు.. సంస్థాగత ఎన్నికలకు కాంగ్రెస్ ప్రిపేర్ అవుతోంది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో.. సుమారు 3 గంటల పాటు కొనసాగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు.. రాష్ట్రాల ఇంచార్జ్‌లు హాజరైన ఈ సమావేశంలో.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళణ చేసే దిశగా కసరత్తు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పీసీసీ చీఫ్‌ల మార్పు.. కీలక యువ నేతలకు ప్రాధాన్యం.. సామాజిక వర్గాల వారీగా.. మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన కాంగ్రెస్ తక్షణ చర్యలకు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల తర్వాత మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై విస్తృతమైన చర్చ జరిగింది. అంతర్గతంగా మరోసారి నిరసన గళం పెరిగింది. ఒక సమయంలో సోనియా గాంధీ పార్టీ అధినాయకత్వాన్ని వదిలిపెడతారనే ప్రచారం కూడా జరిగింది. చివరికి అంతా సద్దుమణిగి.. మళ్లీ మేడమే కంటిన్యూ అయ్యారు.
అయితే ఈ పరాజయంపై పోస్టుమార్టమ్ చేశారు. దీనికి ప్రజల్లో నాయకులు లేకపోవడం.. ఎవరికి వారు ఇష్టానుసారం వ్యవహరించడమే కారణమని గుర్తించారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో పరిస్థితిని పూర్తిగా మార్చాలని నిర్ణయించారు. మరీ ముఖ్యంగా ప్రజలకు చేరువ య్యేందుకు.. ఉద్యమాలు, నిరసనల బాట పట్టడమే దీనికి పరిష్కారమని నాయకులు గుర్తించడం గమనార్హం.