Begin typing your search above and press return to search.
శివసేన తల్లి కాంగ్రెస్సేనా..వెలుగులోకి సంచలన నిజాలు?
By: Tupaki Desk | 30 Nov 2019 7:45 AM GMTశివసేన ..గత కొన్ని రోజులుగా ఎన్నో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రాజకీయ పార్టీ. మహారాష్ట్రలో జరిగిన వ్యవహారం అందరికి తెలిసిందే. మొదట్లో పొత్తులతో బరిలోకి దిగిన బీజేపీ - శివసేన ..ఎన్నికల ఫలితాల తరువాత అధికారం కోసం పొత్తుల నుండి బయటకి వచ్చింది. ఆ తరువాత బీజేపీ తన వ్యూహంతో ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ తో చేతులు కలిపి .. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేన తమ వ్యూహాలకి పదును పెట్టి .. అజిత్ ని వెనక్కి రప్పించాయి. దీనితో మళ్లీ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.
ఇకపోతే ఈ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేనను కాంగ్రెస్ పార్టీయే సృష్టించిందని బహిరంగంగానే చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. 1960 లో ముంబాయ్ లో ట్రేడ్ యూనియన్ల ఆధిపత్యాన్ని అడ్డుకోడానికి తామే సృష్టించామని వెల్లడించారు. శుక్రవారం ఓ జాతీయ మీడియా ఛానల్ చర్చలో పాల్గొంటూ జైరాం ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ - శివసేన మధ్య సైద్ధాంతిక వైరుద్ధ్యం ఉన్నప్పటికీ కూడా - కాంగ్రెస్ సీనియర్ లైన ఎస్.కే. పాటిల్ - వీపీ నాయక్ శివసేన సృష్టించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
తమ మధ్య సిద్ధాంతపరంగా వైరుద్ధ్యాలు ఉన్నప్పటికీ - 1967 ఉదంతాన్ని మర్చిపోవద్దు. ఎస్.కే. పాటిల్ - వీపీ నాయక్ శివసేన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ట్రేడ్ యూనియన్ రాజకీయాల్లో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఏఐటీయూసీ - సీఐటీయూలను ఎదుర్కోడానికే అలా చేశాం అని ఆయన తెలిపాడు. 1980 లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అబ్దుల్ రెహమాన్ అంతులేకు అనుకూలంగా వచ్చిన మొదటి నాయకుడు బాలా సాహేబ్ అని - ఈ విషయాన్ని మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు. ముందునుంచీ ఇరువైపులా ఓ అవగాహన ఉందని, ప్రస్తుతం మాత్రం మా ఇద్దరికి ఒక్కరే శత్రువు అంటూ పరోక్షంగా బీజేపీ గురించి చెప్పారు.