Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలలో హస్తవ్యస్తం...?
By: Tupaki Desk | 3 Nov 2021 11:40 AM GMTదేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు రాజ్యం చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీకి ప్రతీ ఊరిలో ఓటర్లు ఉన్నారు. ఈ రోజుకీ జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ నే చెప్పుకోవాలి. కాంగ్రెస్ ఆసేతు హిమాచలం అంతా ఎరిగిన పార్టీ. ఈ దేశంతో పెనవేసుకుపోయిన పార్టీ. అటువంటి పార్టీ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనావస్థలో ఉంది. ఉమ్మడి ఏపీ రెండుగా చీలిన తరువాత కాంగ్రెస్. అక్కడా ఇక్కడా వెలిగిపోతుందని తప్పుడు అంచనా వేసుకున్న కాంగ్రెస్ పెద్దలకు గత ఏడేళ్ళుగా ఎదురీతే అవుతోంది. ఏపీ తెలంగాణా రెండు చోట్లా కాంగ్రెస్ కి మంచి రోజులు రావడంలేదు. నిజానికి కాంగ్రెస్ కి ఏపీ కంటే తెలంగాణాలో కొంత పట్టు ఉంది. 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకసారి 23, మరోసారి 19 సీట్లను గెలుచుకుంది.
అయితే ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి చూస్తే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేవలం మూడు వేల ఓట్లు సాధించి డిపాజిట్ పోయి దారుణంగా తయారైంది. దీనికి ముందు దుబ్బాకలో కూడా ఇదే సీన్ ఉంది. ఇక నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఇచ్చినా కూడా టీయారెస్ గెలిచింది. ఇక గత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సొంత ఇలాకా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా టీయారెస్ కి తన సీటు అర్పించుకుంది. ఇలా కాంగ్రెస్ సీన్ నానాటికీ దిగనారుతోంది. తెలంగాణాలో అన్నీ ఉండి కూడా అయిదవతనం కరవు అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. దాంతో అక్కడ కేవలం హైదరాబాద్ కే పరిమితమైన బీజేపీ ఇపుడు అన్ని చోట్లా జెండా ఎగరేస్తోంది. టీయారెస్ లాంటి బలమైన పార్టీకి తామే ఆల్టర్నేషన్ అని జనాలకు చెప్పడంలో కమలనాధులు సక్సెస్ అయ్యారనే అనుకోవాలి.
ఇక ఏపీలో చూసుకుంటే గత రెండు ఎన్నికల నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ అడుగుపెట్టలేదు, పైగా వరసబెట్టి డిపాజిట్లు కోల్పోతోంది. బద్వేల్ లో జరిగిన ఉప ఎన్నికలో బీజపీకి 20 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి కానీ కాంగ్రెస్ కి మాత్రం ఆరు వేలు మాత్రమే దక్కాయి అంటే ఒకనాటి బలమైన పార్టీ పరిస్థితి ఏంటి అన్నదే అర్ధం చేసుకోవాలి. ముందు తెలంగాణాలో గెలిచి ఆనక ఆంధ్రాలో కూడా ఆ ఊపులో పాగా వేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కనుక ఎంతో కొంత సఫలీకృతమైతే కాంగ్రెస్ ని రెండు రాష్ట్రాలలోనూ ఇక మరచిపోవచ్చేమో. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో బలమైన ఇందిర, రాజీవ్ గాంధీ నాయకత్వాలు ఉన్నపుడే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు ఉండేది, ఇపుడు అక్కడ కూడా సరైన దిశానిర్దేశకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ కి తెలుగు వెలుగులు ఇప్పట్లో కష్టమేనా అంటే అదే నిజమనుకోవాలేమో.