Begin typing your search above and press return to search.

వార‌ణాసిలో మోడీపై పోటీకి ఎవ‌రంటే?

By:  Tupaki Desk   |   25 April 2019 10:31 AM GMT
వార‌ణాసిలో మోడీపై పోటీకి ఎవ‌రంటే?
X
అంచ‌నాల‌కు చెక్ చెప్పేసి.. సందేహాలు తీర్చేసేలా కాంగ్రెస్ పార్టీ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. గాలు సానుకూలంగా లేని వేళ‌.. వెన‌క్కి త‌గ్గ‌టం మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుంది. గ‌డిచిన కొద్దికాలంగా వార‌ణాసి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప్రియాంక వాద్రాను బ‌రిలోకి దింపాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇందులో ఏ మాత్రం నిజం లేద‌న్న విష‌యం తాజాగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌తో తేలిపోయింది.

వార‌ణాసి బ‌రిలో ప్రియాంక‌ను దించితే లేనిపోని క‌ష్ట‌మే కాదు.. భారీ న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాతోనే కాంగ్రెస్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌ధాని మోడీ బ‌రిలో ఉన్న వార‌ణాసిలో ఆయ‌న‌పై కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప్రియాంక‌ను దింపితే పోటీ ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని భావించినా.. వార‌ణాసిలో మోడీ మీద ఎలాంటి వ్య‌తిరేక‌త లేద‌న్న రిపోర్టులు కాంగ్రెస్ ను వెన‌క్కి త‌గ్గేలా చేసిన‌ట్లు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో వార‌ణాసి బ‌రిలో దిగిన మోడీ ఏకంగా మూడు ల‌క్ష‌ల‌కు పైగా ఓట్ల‌తో భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో వార‌ణాసిలో రోడ్ల విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌టం.. ఈసంద‌ర్భంగా పెద్ద ఎత్తున దేవాల‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దీంతో.. మోడీ ఇమేజ్ మ‌రింత పెరిగింది. హిందుత్వ సెంటిమెంట్ ఎక్కువ‌గా ఉండే వార‌ణాసి లాంటి ప్లేస్ లో ప్రియాంక‌ను దింప‌టం ఏ మాత్రం స‌రికాదన్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇక‌.. మోడీ మీద పోటీకి దిగుతున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి పాత కృష్ణుడే. గ‌త ఎన్నిక‌ల్లో మోడీపై పోటీ చేసి దారుణ ఓట‌మిని మూట‌క‌ట్టుకున్న అజ‌య్ రాయ్ ను తాజాగా మ‌రోసారి కాంగ్రెస్ త‌న అభ్య‌ర్థిగా ఎంపిక చేసింది. దీంతో..ఇక్క‌డ ఎన్నిక ఏక‌ప‌క్షంగా మార‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.