Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. ఖమ్మంలోనూ కమలం..!
By: Tupaki Desk | 17 Aug 2019 6:14 AM GMTబీజేపీ చేపట్టిన ఆపరేషన్ తెలంగాణ- ఆపరేషన్ ఆకర్ష్ చురుగ్గా సాగుతోంది. కమలదళం అనుకున్నది అనుకున్నట్టు చేసి చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో... అందులోనూ తెలంగాణలోనూ మరింద దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇతర పార్టీల్లోని కీలక నేతలందరినీ లాగేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్- టీడీపీలతోపాటు అధికార టీఆర్ ఎస్ పార్టీల నుంచి కూడా లాగుతోంది. ఇన్నిరోజులు ఎక్కువగా నిజామాబాద్- కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల నుంచి వలసలు ఎక్కువగా కనిపించాయి.
తాజాగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కమలం కళకళలాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ జిల్లా నుంచి కూడా పలువురు కీలక నేతలు బీజేపీ గూటికి చేరుతున్నారు. ఇల్లందు మాజీ ఎమ్మల్యే- కాంగ్రెస్ నేత ఊకె అబ్బయ్య కూడా కమలం గూటికి చేరుతున్నారు. ఈ మేరకు అబ్బయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ మారేందుకు డిసైడ్ అయిన ఆయన ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాను పార్టీని మారాలని నిర్ణయించినట్లు చెప్పారు.
రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ దిశంగా ప్రజలు, నాయకులు చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో నరేంద్ర మోదీ పాలనలో సుస్థిరపాలన అందిస్తున్నారని, రాష్ట్రంలోనూ సుస్థిర పాలన కోరకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం పైసా నిధులు కేటాయించలేదని ఆయన ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. మొత్తంగా ఖమ్మం జిల్లాతోపాటు ఇల్లందు నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ఏమీ చేయడంలేదని ఆయన విమర్శలు గుప్పించారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అబ్బయ్య అన్నారు. ఈ నెల 18న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ జెపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. అయితే.. అబ్బయ్యతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇల్లందు నియెజకవర్గం నుంచి వివిధ పార్టీల నేతలు బీజేపీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కోనేరు చిన్ని మాట్లాడుతూ..జిల్లాలో బీజేపీని తిరుగులేని శక్తిగా మారుస్తామని తెలిపారు.
ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల నాటికి ఖమ్మం జిల్లాలోనూ కమలం వికాసం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంకా ఎన్నికలకు సుమారు నాలుగేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు నాయకులు అంటున్నారు. కాగా, అబ్బయ్య రాజీనామాతో తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మొన్నటికి మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కూడా బీజేపీలో చేరారు. ముందుముందు మరికొందరు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.