Begin typing your search above and press return to search.
సైకిల్ సవారీకి సిద్ధమంటున్న కాంగ్రెస్
By: Tupaki Desk | 17 Jan 2017 10:09 AM GMTఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన పార్టీ.. పాలక పార్టీ అయిన సమాజ్ వాదిలో ముసలం కాంగ్రెస్ కు కొత్త ఆశలు రేపుతోంది. తండ్రీకొడుకుల పోరులో సైకిల్ గుర్తు అఖిలేశ్ కే దక్కడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అఖిలేశ్ అండగా తమ సీట్లు పెంచుకోవలనే వ్యూహం రచిస్తోంది. అఖిలేష్ తో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ లోని అన్ని స్థానాలకు పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని... అయితే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నామని కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జాల్ ఈరోజు ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ మొత్తం అఖిలేష్ సింగ్ యాదవ్ వెంటే ఉంటుందని అఫ్జాల్ తెలిపారు. త్వరలోనే అఖిలేష్ - రాహుల్ లు ఎన్నికల కార్యాచరణకు సంబంధించి చర్చలు జరుపుతారని అన్నారు.
అయితే.. అఖిలేశ్ మాత్రం కేవలం కాంగ్రెస్ తో పొత్తుకే పరిమితం కాకుండా మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ లతో కలసి కూటమి ఏర్పాటు చేసేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ పొత్తులకు అవకాశం ఉందని అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్ కూడా స్పష్టం చేశారు. మొత్తానికి యూపీ సీను మారుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/