Begin typing your search above and press return to search.

అయోధ్యపై కాంగ్రెస్ ఓడిపోయిందా?

By:  Tupaki Desk   |   5 Aug 2020 5:00 PM GMT
అయోధ్యపై కాంగ్రెస్ ఓడిపోయిందా?
X
అయోధ్య.. దేశంలోని కోట్ల మంది హిందువుల మనోభావాలతో ముడిపడ్డ ఈ వివాదాస్పద అంశంపై కాంగ్రెస్ ఆది నుంచి గుంభనంగానే వ్యవహరిస్తోంది. ఎందుకంటే అయోధ్య వివాదానికి కారణమైన ‘బాబ్రీ మసీదును’ కూల్చింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే.. 1992లో పీవీ నరసింహరావు ప్రధానిగా ఉండగా బాబ్రీమసీదు కూల్చివేయడం కాంగ్రెస్ చరిత్రలో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది.

కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుతో ముడిపడిన అయోధ్య వంటి సున్నితమైన ఈ సమస్యపై సాధ్యమైనంత మౌనం పాటిస్తూ వచ్చింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ, పీవీ హయాంలో ఎదుర్కొన్న అపప్రదను తొలగించుకునేందుకు కష్టపడుతోంది.

అయోధ్య రామమందిరాన్నే ఎజెండా చేర్చుకొని బీజేపీ పోరాడింది. ప్రస్తుతం ఆ ఎజెండాతోనే బీజేపీ లబ్ధి పొందింది. అయోధ్యతో సంబంధం లేకుండానే రెండు సార్లు భారీ మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీకి చేరుకుంది. అయోధ్యను వ్యతిరేకించిన కాంగ్రెస్ రెండు సార్లు అధికారం కోల్పోయి పతనావస్థలో ఉంది. అయోధ్య కాంగ్రెస్ పార్టీకి ఓ గుణపాఠంగా మారిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయోధ్య రామమందిరాన్ని మెజారిటీ హిందువులు సమర్థిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించలేక ఆపసోపాలు పడింది. అయోధ్యను సమర్థిస్తే బీజేపీకి మద్దతు పెరుగుతుందనే భయాలు.. అలాగని మౌనంగా ఉంటే హిందుత్వ అజెండాగా బీజేపీ దీంతో లబ్ధి పొందుతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ దశాబ్ధాలుగా దీనిపై మౌన ముద్ర వేసింది. మొత్తంగా అయోధ్య విషయంలో కాంగ్రెస్ పార్టీ మౌనమే ఆ పార్టీ పుట్టి మునిగి హిందువులు దూరం అయ్యి ఓటమికి దారితీసిందని చెప్పవచ్చు. అదే హిందుత్వ అయోధ్య నినాదంతో బీజేపీ ఇప్పుడు అధికారాన్ని కొల్లగొట్టిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.