Begin typing your search above and press return to search.
కర్ణాటకలో పడితే కాంగ్రెస్ కే నష్టం!
By: Tupaki Desk | 9 July 2019 2:30 PM GMTకాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా పరాభవమే మిగులుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలో ఉండి కూడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రాబల్యం చూపలేకపోయింది. అలాగే జేడీఎస్ కంటే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ చేతకానితనంతో అప్పట్లో కుమారస్వామికి సీఎం పదవి కట్టబెట్టారు. కాగా ప్రస్తుతం అడ్డం తిరిగితే లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అని పరిశీలిస్తే జేడీఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ నష్టపోయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో జేడీఎస్ ఓ వైపు.. బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తర్వాత కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో భాగంగా ఉంది. అయితే ఇక్కడ కూడా పరిస్థితులు తారుమారు అయ్యాయి. తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ సీఎం పదవి దక్కించుకుంది. అదేవిధంగా రెండు ఎంపీ సీట్ల నుంచి ఒక్క సీటుకు పడిపోయింది. కానీ జేడీఎస్తో పొత్తు కారణంగా కాంగ్రెస్ సీఎం పీఠం కోల్పోడవమే కాకుండా లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 10 స్థానాల నుంచి కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన సంగతి తెలిసిందే.
మాజీ సీఎం, సీఎల్పీ నేత అయిన సిద్ధరామయ్య చుట్టూనే కాంగ్రెస్ కథ తిరుగుతోంది. రాజీనామా చేసిన వారిలో కొందరు సిద్ధరామయ్య వర్గం కాగా.. మరికొందరు ఆయన వ్యతిరేకులుగా స్పష్టం అవుతోంది. అంతేకాకుండా సిద్ధరామయ్య సీఎం పదవి ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు కాంగ్రెస్ నేతలు నిరాకరించారు. జేడీఎస్ కూడా మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పింది.. కానీ దేవెగౌడ మాట మార్చారు. సిద్ధూనీ సీఎం చేస్తూ.. రేవణ్ణను డిప్యూటీ సీఎం చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యను పక్కనపెట్టి మల్లికార్జునఖర్గేకు సీఎం పదవి కట్టబెట్టాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ డిప్యూటీ సీఎం పరమేశ్వర్, మంత్రి డీకే శివకుమార్ అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి రామలింగారెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆయనకు సీఎం పదవి ఇస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెచ్చారు. అయితే సిద్ధరామయ్య వర్గం ఒప్పుకోవాల్సి ఉంది.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేసిన బీజేపీ తాజాగా.. నలుగురు మంత్రులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంటీబీ నాగరాజు, శివానందపాటిల్, తుకారాంకు మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు తెలిసింది. కాగా మాజీ మంత్రి హెచ్.విశ్వనాథ్ ఇప్పటికే కాంగ్రెస్›– జేడీఎస్ నేతలపై అసమ్మతి వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే.