Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్యా.. ఆ పార్టీల‌కు కాంగ్రెస్ ఊర‌ట‌నిచ్చింది!

By:  Tupaki Desk   |   6 Sep 2021 4:48 AM GMT
హ‌మ్మ‌య్యా.. ఆ పార్టీల‌కు కాంగ్రెస్ ఊర‌ట‌నిచ్చింది!
X
యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎస్పీ, బీఎస్పీల‌తో త‌మ‌కు పొత్తు ఉండ‌ద‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించేసింది. యూపీలో తాము పొత్తుల‌తో వెళ్ల‌బోతున్నాం కానీ, ప్ర‌ధాన పార్టీలైన ఎస్పీ-బీఎస్పీల‌తో పొత్తు ఉండ‌ద‌ని ప్ర‌క‌టించింది కాంగ్రెస్. ఒక‌ర‌కంగా ఇది ఆ పార్టీల‌కు ఊర‌టే. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అనేక ప్రాంతీయ పార్టీలు చాలా దెబ్బ‌తిన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ఉన్న పార్టీలు కూడా కాంగ్రెస్ తో జ‌త క‌ట్టి దెబ్బ‌తిన్న దాఖ‌లాలు ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. యూపీలోని ఎస్పీ, బీఎస్పీల‌కు కాంగ్రెస్ ఊర‌ట‌ను ఇచ్చే ప్ర‌క‌ట‌న చేసింద‌నే చెప్పాలి.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌ప్పుడు స‌మాజ్ వాదీ పార్టీ వాళ్లు కాంగ్రెస్ ను బాగా న‌మ్మారు. బీజేపీ అప్ప‌టికే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన నేప‌థ్యంలో.. తాము కాంగ్రెస్ తో జ‌త క‌డితే ఒక ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగిన‌ట్టుగా అవుతుంద‌ని, ఓట్ల చీలిక కూడా త‌గ్గి తామే అధికారంలోకి వ‌స్తామ‌ని స‌మాజ్ వాదీ పార్టీ లెక్క గ‌ట్టింది. కాంగ్రెస్ కు భారీ సంఖ్య‌లో సీట్ల‌ను ఇవ్వ‌డానికి కూడా ఆ పార్టీ వెనుకాడ‌లేదు. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ యూపీలో అప్పుడు 90 శాతం సీట్ల‌ను సాధించ‌డంతో.. ఎస్పీ బెంబేలెత్తింది. కాంగ్రెస్ తో పొత్తే బీజేపీకి గ‌ట్టి ఆన్స‌ర్ అవుతుంద‌ని ఎస్పీ లెక్క‌లేసింది.

అయితే.. అస‌లు క‌థ వేరేగా మారింది. ఎస్పీ చిత్తుగా ఓడింది. దాదాపు వంద సీట్ల‌లో ఆ పొత్తులో భాగంగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది. అప్ప‌టికే కాంగ్రెస్ పై ఉత్త‌రాదిన ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఎస్పీ కూడా నెత్తికెత్తుకున్న‌ట్టుగా అయ్యింది. కాంగ్రెస్ తో జ‌త క‌ట్ట‌డం వ‌ల్ల లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ‌ని అప్ప‌టికి ఎస్పీ గ్ర‌హించింది. అందుకే.. క్ర‌మంగా ఆ పార్టీకి దూరం అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు గురించి మ‌ళ్లీ ఏమైనా ఆ పార్టీ ఆలోచిస్తోందో లేదో కానీ, కాంగ్రెస్ మాత్రం తాము పొత్తు పెట్టుకోమంటూ ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఎస్పీ, బీఎస్పీల‌కు ఊర‌ట‌ను ఇచ్చింది.

అయితే చిన్న పార్టీల‌తో మాత్రం త‌మ పొత్తు ఉంటుంద‌ని కాంగ్రెస్ యూపీ విభాగం అంటోంది. మ‌రి అవి ఏ పార్టీలో ఇంకా క్లారిటీ లేదు. యూపీని మూడు ద‌శాబ్దాలుగా ఎస్పీ, బీఎస్పీ, బీజేపీలే పాలిస్తున్నాయ‌ని.. ఈ సారి ప్ర‌జ‌లు త‌మ‌కు అవ‌కాశం ఇస్తార‌ని కాంగ్రెస్ నేత‌లు ధీమాగా చెబుతుండ‌టం విశేషం.