Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డిపై వేటు..సాయంత్రం కీల‌క స‌మావేశం

By:  Tupaki Desk   |   21 Sep 2018 12:26 PM GMT
కోమ‌టిరెడ్డిపై వేటు..సాయంత్రం కీల‌క స‌మావేశం
X
తెలంగాణ కాంగ్రెస్‌ లో అసంతృప్తులు తారాస్థాయికి చేరుతున్న సంగతి తెలిసిందే. పార్టీ పెద్ద‌లు ప్ర‌క‌టించిన క‌మిటీల‌పై సీనియ‌ర్ నేత‌లు వి. హ‌నుమంత‌రావు - పొంగులేటి సుధాక‌ర్‌ రెడ్డి ఈ క‌మిటీల కూర్పుపై భ‌గ్గుమన‌డానికి కొన‌సాగింపుగా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ లో ఒక‌రై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పీసీసీ కమిటీలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ‌టం తెలిసిన సంగ‌తే. పీసీసీ కమిటీలపై బ్రోక‌ర్లకు వేదిక‌గా మారిందంటూ సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. .నిన్న మొన్న పార్టీలలో చేరి జైలు కు వెళ్లివచ్చిన నాయకులకు కూడా పెద్ద పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ కుంతియా త‌మకు శనిలా దాపురించాడని భ‌గ్గుమ‌న్న ఆయ‌న వంద మంది కుంతియాలు వచ్చినా భయపడేది లేదన్నారు.

ఇలా పార్టీలోని ప‌రిణామాల‌పై మండిప‌డ‌టం...ఏకంగా రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జీపై విరుచుకుప‌డిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్‌ గా స్పందించారు. కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి - వి.హనుమంతరావు వ్యాఖ్యలపై పార్టీ క్రమ శిక్షణ చర్యల సంఘం స‌మావేశం అయింది. గాంధీభవన్ లో జ‌రిగిన ఈ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులు కోదండరెడ్డి - కమలాకర్ రావు - బలరాం నాయక్ - శ్రీనివాసరావు - సంబాని చంద్రశేఖర్ ఏ నిర్ణ‌యం తీసుకుకోవాల‌నే విష‌యాన్ని చ‌ర్చించారు. త‌గు నిర్ణ‌యం తీసుకోవాల‌ని తీసుకోవాల‌ని ప్ర‌తిపాదించారు. మ‌రోవైపు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ ఆర్సీ కుంతియా సైతం ఘాటుగా స్పందించారు. రాజగోపాల్ - వీహెచ్ వ్యాఖ్యలు త‌న దృష్టికొచ్చాయని పేర్కొన్నారు. పార్టీ డిసిప్లినరీ కమిటీలో చర్చిస్తామ‌ని - పార్టీ నిబంధనల మేరకు వారిపై చర్యలుంటాయన్నారు.

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా స్పందిస్తున్న నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ సైతం ఘాటుగానే రియాక్ట‌య్యారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ పెద్ద‌లు ఏదైనా నిర్ణ‌యం తీసుకున్నా లేదా దూకుడుగా స్పందిస్తున్నా త‌మ దారి తాము చూసుకోవాల‌ని వారు నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఈ విలేక‌రుల స‌మావేశంలో కూడా కోమ‌టిరెడ్డి ఘాటుగా స్పందిస్తే...ఆయ‌న‌పై వేటు ప‌డ‌టం ఖాయ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.