Begin typing your search above and press return to search.
సీఎం యోగి నోట వివాదాస్పద వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 5 April 2019 10:50 AM GMTవివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన నోటికి పని చెప్పారు. కరడుగట్టిన కాషాయవాది అయిన యోగికి కాంగ్రెస్ అన్నా.. ఆ పార్టీకి చెందిన నేతలన్నా అస్సలు పడదు. వారి గాలిని కూడా ఆయన తట్టుకోలేరు. అలాంటి యోగి.. తాజాగా ముస్లిం లీగ్ మీద ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయటం కలకలం రేపుతోంది.
ముస్లిం లీగ్ ఒక ప్రాణాంతక వైరస్ అని.. అదిప్పటికే కాంగ్రెస్ పార్టీని సోకిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరా్టీ.. ముస్లింలీగ్ కానీ గెలిస్తే.. ఆ వైరస్ దేశమంతా వ్యాప్తి చెందుతుందన్నారు. ట్విట్టర్ వేదికగా చేసుకొని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ముస్లిం లీగ్ అన్నది ఒక వైరస్. అదెలాంటి వైరస్ అంటే.. అది సోకిన వారెవరూ బతకరు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఆ వైరస్ సోకింది. ఆ పార్టీ ఒక్కసారి గెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక్కసారి గెలిచినా ఆ వైరస్ దేశం మొత్తం పాకుతుందన్నారు.
ఇండియన్ ముస్లిం లీగ్ బలంగా ఉన్న వయనాడ్ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నామినేషన్లు వేయటం.. అక్కడ ఆయన విజయం తథ్యమని చెబుతున్న వేళ.. రాహుల్ గెలుపును తక్కువ చేసి చూపించే ప్రయత్నానికి యోగి తెర తీశారని చెప్పాలి. అంతేకాదు.. ముస్లింలీగ్ పార్టీని వైరస్ గా పేర్కొనటం ద్వారా కొత్త వివాదానికి తెర తీయటం.. కాంగ్రెస్ కు హిందూ వ్యతిరేకులన్న కలర్ ఇచ్చేలా ఆయన మాటలు ఉన్నట్లు చెబుతున్నారు. కేరళలోని మొత్తం 20 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ 16 చోట్ల పోటీ చేస్తుండగా.. ఆ పార్టీ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రెండు స్థానాల్లో..కేరళ కాంగ్రెస్ (మణి) ఒక స్థానంలో.. సోషలిస్టు పార్టీ మరో చోట పోటీ చేస్తున్నాయి. యోగి తాజా వైరస్ ట్వీట్ వివాదం ఎక్కడి వరకూ వెళుతుందో?