Begin typing your search above and press return to search.

రాజ‌స్థాన్ రాజ‌కీయం గ‌రంగ‌రం.. ముఖ్య‌మంత్రి పీఠానికి ఎస‌రు!

By:  Tupaki Desk   |   25 Sep 2021 12:30 PM GMT
రాజ‌స్థాన్ రాజ‌కీయం గ‌రంగ‌రం.. ముఖ్య‌మంత్రి పీఠానికి ఎస‌రు!
X
రాజ‌స్థాన్ రాజ‌కీయాలు.. వేడెక్కాయి. ముఖ్య‌మంత్రి మార్పే ల‌క్ష్యంగా ఇక్క‌డ పాలిటిక్స్ రాత్రికి రాత్రి పుం జుకున్నాయి. ఇటీవల పంజాబ్‌లో ముఖ్య‌మంత్రిని మార్చినట్లు.. రాజస్థాన్ లోనూ ముఖ్య‌మంత్రిని మా ర్చేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌ద‌ప‌డం ప్రారంభ‌మైంది. రాజ‌స్థాన్‌కు చెందిన ప్రముఖ నేత సచిన్‌ పైలట్ వారం వ్యవధిలో రెండు సార్లు పార్టీ పెద్దలను కలవడంతో ముఖ్య‌మంత్రి మార్పు అనివార్య‌మ‌నే చ‌ర్చ‌కు బ‌లం చేకూర్చుతోంది.

గతంలో తనను ముఖ్యమంత్రి చేస్తారనే హామీని పైలట్ పార్టీ అధిష్టానం ముందుకు తీసుకువ‌చ్చారు. అంతేకాదు.. ఇప్ప‌టికిప్పుడు త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి రాష్ట్రంలో నాయకత్వ మార్పును వాయిదా వేయడానికే అధిష్ఠానం మొగ్గు చూపుతు న్నట్లు తెలుస్తున్నా.. పైల‌ట్ ఒత్తిడి భిన్నంగా ఉంది. అయితే.. ఈ క్ర‌మంలోనే ఆయన్ను కాస్త సంతృప్తి పరిచేందుకు.. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన విధేయులను నియమించడానికి మాత్రం అంగీకరించినట్లు సమాచారం.

మరోవైపు ఈ పరిణామాలపై ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌.. వర్గం అలెర్ట‌యింది. గతేడాది ఆయనపై అసమ్మతి స్వరం వినిపిస్తూ సచిన్‌ పైలట్‌తోపాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేత కావడంతో.. పార్టీ అధిష్ఠానం ఆయనతో చర్చలు జరిపి సమస్యను కొలిక్కి తెచ్చింది. తాజాగా పైలట్‌ మరోసారి రాజకీయంగా పావులు కదుపుతుండటం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార బాధ్యతలను పైలట్‌కు అప్పగించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

అయితే, పైలట్ ప్రస్తుతం రాజస్థాన్‌పైనే దృష్టి పెట్టారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికిప్పు డు అధికారం మార్పు కోరుకుంటున్నారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ముఖ్య‌మంత్రిని మారిస్తే.. గుజ‌రాత్ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో మార్పు అనివార్య‌మే అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికిప్పుడు కాద‌నేది పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వ‌చ్చాయి. అయితే.. ముఖ్య‌మంత్రి గెహ్లాట్ మాత్రం కీలు బొమ్మ‌కానున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే.. అప్ర‌క‌టిత ముఖ్య‌మంత్రిగా పైల‌ట్ చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.