Begin typing your search above and press return to search.
ఎంతలా బుక్ అవ్వాలో అంతగా బుక్ అయ్యాడు
By: Tupaki Desk | 26 April 2016 1:35 PM GMTఒక రాజకీయ నేత ఎంతలా బుక్ కాకూడదో అంతలా బుక్ అయిపోయాడు బీహార్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ వర్మ. బీహార్ లో ప్రస్తుతం సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా పూటుగా తాగేసి కెమేరా కంటికి అడ్డంగా దొరికిపోయాడు. చివరకు విషయం సీరియస్ కావటమే కాదు సొంత పార్టీ నుంచి షోకాజ్ నోటీసును సైతం అందుకున్నాడు.
బీహార్ కు చెందిన వినయ్ వర్మ నర్కాట్ గంజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. ఇప్పుడా రాష్ట్రంలో ఇప్పుడు మద్యం మీద బ్యాన్ ఉంది. మద్యం సేవించటమే కాదు.. ఎవరికైనా ఆఫర్ చేసినా కూడా నేరమే. ఈ తప్పునకు గరిష్టంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకూ శిక్ష విధించే అవకాశం ఉంది. ఒక.. జరిమానా విషయానికి వస్తే రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకూ విధించే వీలుంది.
ఇంతటి కఠిన నిబంధనలు అమలు అవుతున్న వేళ.. మద్యం తాగుతూ కెమేరా కంటికి దొరికిపోవటమే కాదు.. తన చుట్టూ ఉన్న వారికి లిక్కర్ ఉందని ఆఫర్ చేయటం రికార్డు అయ్యింది. తన దగ్గరున్న ఫారిన్ బ్రాండ్ల గురించి వివరంగా చెబుతూ ఎమ్మెల్యే దొరికిపోయారు. అయ్యగారి లిక్కర్ అవేర్ నెస్ చూసిన రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కోరి తిప్పులు తెచ్చుకోవటం అంటే ఇదేనేమో..?