Begin typing your search above and press return to search.

3 రోజుల‌కే ముఖాముఖికి రెఢీ అవుతున్నారే!

By:  Tupaki Desk   |   26 May 2018 4:27 AM GMT
3 రోజుల‌కే ముఖాముఖికి రెఢీ అవుతున్నారే!
X
క‌ర్ణాట‌క‌ అధికార‌ప‌క్షంలోని మిత్రుల మ‌ధ్య అప్పుడే విభేదాలు పొడ‌చూపాయి. ఒక సీటు కోసం రెండు పార్టీల మ‌ధ్య పోటీ ఒక కొలిక్కి రావ‌టం లేదు. స‌ద‌రు సీటును త‌మ‌కు వ‌దిలి పెట్టాలంటూ కాంగ్రెస్‌.. జేడీఎస్ లు ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతున్నారు. ఈ సీటు విష‌యంలో ఇరువురు ఎక్క‌డా రాజీ ప‌డ‌ని ప‌రిస్థితి.

అధికార‌ప‌క్షానికి చెందిన రెండు పార్టీల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నా.. ఫ‌ల‌వంతం కావ‌టం లేదు. రాజ‌రాజేశ్వ‌రీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు.. సోమ‌వారం జ‌ర‌గ‌నున్నాయి. ఒక‌వైపు రాజీ చ‌ర్చ‌లు సాగుతుంటే.. మ‌రోవైపు.. ఇలాంటి ప‌రిణామం మిత్రుల మ‌ధ్య లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చి పెడుతుంద‌ని చెబుతున్నారు.

క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి మూడు రోజుల కూడా కాక‌ముందే.. ఈ రెండు పార్టీలు (కాంగ్రెస్‌.. జేడీఎస్ లు) ఒక‌రిపై ఒక‌రు పోటీకి దిగ‌టం బాగోద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇద్ద‌రి మిత్రుల మ‌ధ్య పోటీ.. చివ‌ర‌కు బీజేపీకి ల‌బ్థి చేకూరితే.. ప్ర‌భుత్వానికి అంత‌కు మించిన ఫెయిల్యూర్ మ‌రొక‌టి ఉండ‌దంటున్నారు.

మిత్ర‌ప‌క్షాల అభ్య‌ర్థులు ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌కుండా ఉండేందుకు వీలుగా.. రెండు పార్టీల‌కు చెందిన ముఖ్య‌నేత‌లు.. ముఖ్య‌మంత్రి.. ఉప ముఖ్య‌మంత్రి ఇద్ద‌రు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. మ‌రి.. ఇవి ఏ మేర‌కు ఫ‌లిస్తాయ‌న్న‌ది ఉత్కంట‌గా మారింది.