Begin typing your search above and press return to search.

టీఆరెస్ లోకి మాజీ మంత్రి సారయ్య?

By:  Tupaki Desk   |   22 Feb 2016 9:06 AM GMT
టీఆరెస్ లోకి మాజీ మంత్రి సారయ్య?
X
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అక్కడి కాంగ్రెస్ నేతలపై గులాబీ పార్టీ కన్నేసింది. అందులో భాగంగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్యను పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన టీఆరెస్ లో చేరొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణలో టీడీపీని చాలావరకు ఖాళీచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలనూ ఆకర్షించాలని టీఆరెస్ నిర్ణయించుకుంది. ముందుగా కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతలపై దృష్టి పెట్టి వరంగల్ తూర్పు నియోజకవర్డం లో మొన్న టీఆరెస్ నేత కొండా సురేఖ చేతిలో ఓడిపోయిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్యను పార్టీలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే దీనిపై చర్చలు ముగిశాయని... ఆయన అనుచరులతో కలిసి మంగళవారమే టీఆరెస్ లో చేరుతారని తెలుస్తోంది.

బీసీ వర్గానికి చెందిన సారయ్య చేరితే ఈ ఎన్నికల్లో పార్టీకి ఉపయోగముంటుందని భావిస్తున్నారు. 2009లో వరంగల్ ఈస్ట్ నుంచి గెలిచిన సారయ్య ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఆయన 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ఆయన అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు.