Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు కోవర్ట్ రోగం.. మరో సీనియర్ నేత సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   13 Dec 2022 3:59 PM GMT
కాంగ్రెస్ కు కోవర్ట్ రోగం.. మరో సీనియర్ నేత సంచలన కామెంట్స్
X
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ ముసలం మొదలైంది. ఏఐసీసీ కమిటీల ప్రకటన చిచ్చు పెట్టింది. నిన్న పదవులకు కొండా సురేఖ రాజీనామా చేయగా.. ఈరోజు మరో సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి పార్టీ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కు ప్రమాదకరమైన జబ్బు సోకిందని.. వెంటనే ప్రక్షాళన చేయాలంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకుండా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టానని.. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం గురించి ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం కోసమే వచ్చానని దామోదర అన్నారు. వచ్చే డిసెంబర్ లోనే ఎన్నికలు ఉన్నాయని.. కానీ పార్టీ పరిస్థితి ఘోరంగా దిగజారిందని దామోదర అన్నారు.

కాంగ్రెస్ చేసిన గొప్ప పనులు బతికిస్తాయనే ఆశతో ఇన్ని రోజులు క్యాడర్ ఎదురుచూసిందని.. కానీ కాంగ్రెస్ లో లోపాలు ఉన్నాయని.. అవి ఎక్కడ అనే దానిపై కసరత్తు జరగాలన్నారు. ఎందుకనే అలా జరగడం లేదన్నారు.

ఇటీవల కాంగ్రెస్ వేసిన కొత్త కమిటీలను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందన్నారు. పీసీసీ డెలిగేట్స్ నుంచి ఇదే విధంగా తప్పులు జరుగుతున్నాయని.. కొత్తగా వచ్చిన వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇచ్చారని.. ఏ లెక్క ప్రకారం కొత్త వారికి పదవులు ఇచ్చారు? 84 మంది జనరల్ సెక్రటరీలు అవసరమా? సమైక్య రాష్ట్రంలో కూడా ఇంతమంది జనరల్ సెక్రటరీలు లేరు కదా? అని ప్రశ్నించారు.

కమిటీలో అనర్హులకు చోటు కల్పించి బలహీన వర్గాలకు కాంగ్రెస్ లో గుర్తింపు ఇవ్వలేదని దామోదర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో తెలయని వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదన్నారు. కోవర్టులకే గుర్తింపు ఉంటోందని.. తెలంగాణకు కాంగ్రెస్ కు కోవర్ట్ ఇజం అనే ప్రమాదకరమైన జబ్బు సోకిందన్నారు. ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ కు కోవర్టు రోగం పట్టుకుందన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.