Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కి హ్యాండ్.. వైసీపీతో షేక్ హ్యాండ్
By: Tupaki Desk | 12 Oct 2017 12:17 PM GMTఏపీలో వైసీపీ గాలి బలంగా వీస్తోంది! ప్రభుత్వంపై ప్రజల్లో నానాటికీ వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో.. నేతలంతా ఇప్పుడు వైసీపీ చెంతకు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్ష నేత జగన్ పై ప్రజలపైనే గాక ఇతర పార్టీనేతల్లోనూ నమ్మకం పెరుగుతోంది. ముఖ్యంగా విభజన తర్వాత అంపశయ్యపై పడిపోయిన కాంగ్రెస్ లోని నేతలు.. ఇప్పుడు జగన్ చెంత చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి - తుమ్మపాల షుగర్స్ మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే అధిష్ఠానానికి లేఖ కూడా పంపేశారు!
తన అనుచరులతో సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటానని దిలీప్ కుమార్ తెలిపారు. కాగా, ఆయన వైసీపీలో చేరనున్నట్లుగా స్థానికంగా ప్రచారం సాగుతోంది. గురువారం హైదరాబాద్ లోని ఆ పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. తన అనుచరులతో కలిసి హైదరాబాద్ వెళ్లారని తెలుస్తోంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ - వైసీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఇటీవల తుమ్మపాలలోని దిలీప్ కుమార్ ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు.
12వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ఆ రోజే నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు. దిలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ హయాంలో తుమ్మపాల షుగర్స్ పాలకవర్గం చైర్మన్ గా పని చేశారు. 1995లో టిడిపిలో చేరిన ఆయన కొద్దిరోజులకే తిరిగి సొంత గూటికి చేరారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు.