Begin typing your search above and press return to search.

జైలు నుంచి వచ్చాక ఈ అస్వస్థత ఏంది?

By:  Tupaki Desk   |   3 Nov 2019 4:25 AM GMT
జైలు నుంచి వచ్చాక ఈ అస్వస్థత ఏంది?
X
దిట్టంగా ఉన్నట్లు కనిపిస్తూ.. ఫుల్ ఫిట్ గా అనిపించే నేతలు పలువురు జైల్లోకి వెళ్లినంతనే అస్వస్థతకు గురి కావటం.. ఆసుపత్రి పాలుకావటం చూస్తుంటాం. తాజా ఎపిసోడ్ దీనికి భిన్నం. జైల్లో ఉన్నంత కాలం బాగున్న సదరు ముఖ్యనేత.. జైలు నుంచి విడుదలైన నాటి నుంచి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య సమస్యల్ని చూసిన ఫాలోయర్స్ పరేషాన్ అవుతున్న పరిస్థితి. ఇదంతా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కమ్ మాజీ మంత్రి డీకే శివకుమార్.

ఇటీవల తీహార్ జైలు నుంచి విడుదలైన ఆయన.. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయానికి చేరటానికి గంటల సమయం పట్టటం.. పెద్ద ఎత్తున అభిమానులు పోటెత్తటం తెలిసిందే. జైలు నుంచి విడుదలయ్యాక మరింత చురుగ్గా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన.. శనివారం ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో.. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయనకు బీపీ పెరగటం.. షుగర్ లెవల్స్ పడిపోవటం.. వెన్నునొప్పితో పాటు ఛాతీ నొప్పితో ఆయన బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను బెంగళూరులోని శేషాద్రిపురంలో ఉన్న అపోలోలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జైలు నుంచి వచ్చిన తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొనటంతో అసలే మాత్రం విశ్రాంతి ఉండటం లేదంటున్నారు. ఈ కారణంతోనే ఆరోగ్య సమస్యలు ఎదురై ఉంటాయన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఆరోగ్య సమస్యలు జైల్లో ఉన్నప్పుడు వస్తాయే కానీ.. జైలునుంచి బయటకు వచ్చి.. ఫాలోయింగ్ గ్రాఫ్ పెరిగిన వేళ రావటం ఏమిటంటూ ఆసక్తికరంగా చర్చించుకోవటం కనిపిస్తోంది.