Begin typing your search above and press return to search.
రాహుల్ సభలంటే బెంబేలెత్తి పోతున్న కాంగ్రెస్ నేతలు
By: Tupaki Desk | 4 Dec 2018 9:43 AM GMTఔను. సాక్షాత్తు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ నేత రాహుల్ గాంధీ సభలను కాంగ్రెస్ నేతలు వద్దంటున్నారని ప్రచారం జరుగుతోంది. బాబోయ్ రాహుల్ సభలు వద్దు అని కాంగ్రెస్ నేతలు అంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు రాహుల్ సభలు వద్దనడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా... దీని వెనుక ఆసక్తికరమైన లెక్కలు ఉన్నాయి. రాహుల్ సభ వద్దనడానికి ప్రధాన కారణం ఖర్చు, సమయం అని దీంతో పాటుగా మరిన్ని లెక్కలు కూడా ఉన్నాయంటున్నారు. అందుకే తమ నాయకుడి సభ అంటే నో చెప్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సొంత పార్టీ నేతలే ప్రచారం వద్దని చెప్తున్న విషయం తెలిసి కాంగ్రెస్ అగ్రనేతలు, అధిష్టానం షాక్ అయినట్లు సమాచారం. ఈ మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ సభ పెడదామని ఎవ్వరినీ అడిగినా వద్దంటే, వద్దన్నారట... దీంతో ఆ సభ గండ్ర వెంకటరమణారెడ్డి నెత్తిన పడింది.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ సభకు ఒప్పుకున్నారట. రాహుల్ గాంధీ సభ అంటే నాలుగైదు రోజులు అదే పనిలో ఉండాలి... జన సమీకరణ చేయాలి... జనం ఎక్కువగా కనపడక పోతే ఫెయిల్యూర్ టాక్ వస్తుంది... ఇది మొత్తానికి మోసం చేస్తుంది... జనం ఎక్కువ రావాలంటే డబ్బు బాగా ఖర్చు అవుతుంది. సభకు పెట్టే ఖర్చుతో రెండు మూడు మండలాలను ఎన్నికల ఖర్చు పూర్తిగా చూసుకోవచ్చని అంటున్నారు. ఆయన మాట్లాడితే ప్రజల్లోకి అంతగా ఎక్కదు కూడా అంటున్నారు. నాలుగు, రోజుల ప్రచారం బంద్ పెట్టి డబ్బు ఖర్చు వల్ల పెద్దగా లాభం లేదని వద్దంటున్నారట. ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు, డబ్బుకు కొదవలేని గెలుపు పరువు ముఖ్యం అనే పెద్ద లీడర్లు రేవంత్, డీకే అరుణ,పద్మావతి లాంటి వారు మాత్రమే రాహుల్ గాంధీ సభలకు ఒప్పుకున్నారు.
రాహుల్ వస్తే నన్న ప్రయోజనం వస్తుందేమో నని రేవంత్, డీకే లాంటి వారే సభలు పెట్టుకున్నారని తెలుస్తోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏ నేత కూడా రాహుల్ సభకు ఒప్పుకోవడం లేదట... దీంతో కాంగ్రెస్ అగ్ర నేతలే ఖంగుతింటున్నారట. హైదరాబాద్ నేతలైతే భారీ సభలు కుదరవు, గల్లీలో కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలు ఐతే ఒకే అంటున్నారు... ఇలా అయితే రోజూ తిరిగే కార్యకర్తలు,మరో రెండు మూడు వేల మందిని తరలిస్తే చాలు, రోడ్ ట్రాఫిక్ జామ్ తో కవర్ అయిపోతుందని ఒప్పుకుంటున్నారట... గ్రేటర్ సభల్లో ఎక్కడా 5 వేలకు మించకుండానే సభలు కానిచ్చేస్తున్నారని అంటున్నారు.