Begin typing your search above and press return to search.
మోడికి ఆమె శాపం పెట్టేశారు
By: Tupaki Desk | 23 Oct 2015 4:09 AM GMTఅమరావతి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి అయిన వెంటనే.. ఏపీ విపక్షాలకు విరుచుకుపడేందుకు విపరీతమైన అవకాశం లభించింది. ఎలాంటి విమర్శలకు.. వంక పెట్టేందుకు అవకాశం ఇవ్వకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ.. ప్రధాని మోడీ నోటి వెంట ఏపీకి వరాలు ఏమీ రాకపోవటంతో ఏపీ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
ఇక.. ఏపీ కాంగ్రెస్ నేతలు అయితే ఇదే అదనుగా చెలరేగిపోయారు. పార్లమెంటు నుంచి మట్టి.. యమునా నీటిని తీసుకొచ్చిన మోడీ.. ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పటమే కాదు.. నాడు కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ ఐదేళ్లు అంటే.. కాదు పదేళ్లు అని వెంకయ్యనాయుడు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదిహేనేళ్లు అని చంద్రబాబు నాయుడు మాట్లాడారని.. కానీ.. అలాంటివేమీ మోడీ ప్రకటించలేదన్నారు.
మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏపీకి వరాలు ఇప్పించుకునేలా చేయటంలో బాబు ఫెయిల్ అయ్యారని మండిపడ్డ ఏపీ మహిళా కాంగ్రెస్ నేత గంగాభవాని వెరైటీగా స్పందించారు.
ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టి వెళ్లి పోయిన మోడీ నేతృత్వం వహిస్తున్న బీజేపీకి బీహార్ లో అపజయం తప్పదని తేల్చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల్ని మోసం చేసిన దానికి అంతకంతకు ఫలితం అనుభవిస్తారని ఆమె శపించారు. తాను శపిస్తున్నానని.. బీహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమి మట్టి కొట్టుకుపోవటం ఖాయమన్నారు. మరి.. గంగా భవాని లాంటి వారి శాపాలు మోడీ చెవిన పడతాయా..?