Begin typing your search above and press return to search.

కర్ణాటక సీఎం పోస్టు రేటు రూ.2500 కోట్లు

By:  Tupaki Desk   |   21 Aug 2022 12:30 AM GMT
కర్ణాటక సీఎం పోస్టు రేటు రూ.2500 కోట్లు
X
సంచలన ఆరోపణలు చేశారు కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చాలా ఖరీదైన వ్యవహారంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పటం గమనార్హం. కర్ణాటక సీఎం పోస్టు విలువ రూ.2500 కోట్లు అని బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. తనతో అంతటి మాట చెప్పిన బీజేపీ నేత ఎవరన్న విషయాన్ని మాత్రం హరిప్రసా్ వెల్లడించలేదు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చాలా ఖరీదైనదని.. దాని కోసం చాలామంది ఆశావాహులు పోటీ పడుతున్నారని.. పెద్ద మొత్తంలో డబ్బు ప్రమేయం ఉందని పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గడిచిన కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి బొమ్మైను తప్పిస్తున్నారని. కొత్త నేతకు ముఖ్యమంత్రి కుర్చీ అప్పజెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు బసవరాజ్ బొమ్మైను మార్చే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటి వేళ.. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చాలా ఖరీదైనదన్న ప్రచారం తెర మీదకు రావటం గమనార్హం. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్ప పేరు వినిపిస్తున్న వేళ.. ఆయన్ను బీజేపీ అత్యున్నత కమిటీ అయిన.. బీజేపీ పార్లమెంటరీ ప్యానెల్ లో సభ్యుడిగా ఎంపిక చేసిన నేపథ్యంలో బొమ్మైకు ఉద్వాసన పలుకుతారన్న ప్రచారం సాగుతోంది.

వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. కాస్త ముందుగా ముఖ్యమంత్రిని మార్చటం ద్వారా.. ప్రయోజనం చేకూరుతుందన్న మాట వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంతన్నది కాలమే సమాధానం చెప్పాలి.