Begin typing your search above and press return to search.

హిందూ పెద్ద‌ను రాష్ట్రప‌తి చేయాలంటున్న కాంగ్రెస్

By:  Tupaki Desk   |   2 April 2017 6:06 AM GMT
హిందూ పెద్ద‌ను రాష్ట్రప‌తి చేయాలంటున్న కాంగ్రెస్
X
ఆర్‌ఎస్‌ఎస్ ర‌థ‌సార‌థి మోహన్ భాగవత్‌ను రాష్టప్రతి చేయాలనే డిమాండ్‌కు అనూహ్య మ‌ద్ద‌తు ద‌క్కింది. త్వరలోనే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ విరమణ చేయనుండ‌టంతో ప్రణబ్ స్థానంలో భాగవత్ రాష్టప్రతి అవుతారని కథనాలు వెలువడుతున్నాయి. శివ‌సేన ఎంపీ ఏకంగా ఇదే డిమాండ్ వినిపించారు. అయితే తాను రాష్టప్రతి రేసులో లేనని భాగవతే స్వయంగా ప్రకటించారు. అయిన‌ప్ప‌టికీ కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత సీకే జాఫర్ షరీఫ్ ఆయ‌న్ను రాష్ట్రప‌తి చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.

రాష్టప్రతి కావడానికి అవససరమైన అన్ని అర్హతలూ భగవత్‌కు ఉన్నాయంటూ మార్చి 29న ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ష‌రీఫ్‌ పేర్కొన్నారు. ‘భాగ‌వ‌త్‌ దేశభక్తిని శంకించాల్సిన పనిలేదు. అలాగే రాజ్యాంగం పట్ల ఎంతో అంకితభావం ఉన్నవారు’ అని మాజీ రైల్వే మంత్రి అయిన‌ షరీఫ్ స్పష్టం చేశారు. ‘భాగ‌వ‌త్‌ అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించరన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. దేశాధ్యక్ష పదనికి అవసరమైన అన్ని అర్హతలూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు ఉన్నాయి’ అంటూ కాంగ్రెస్ నేత ఆ లేఖలో తెలిపారు. భాగవత్ రాష్టప్రతి అయితే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని షరీఫ్ అభిప్రాయపడ్డారు. శివసేన తరువాత భాగవత్‌ను రాష్టప్రతిని చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీయేతర నేత షరీఫ్. అయితే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను రాష్టప్రతి చేయాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు అది వ్యతిరేకమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని షరీఫ్ దగ్గర ప్రస్తావిస్తే నిబద్ధత ఉన్న నేత భగవత్, అందుకే ఆయన రాష్టప్రతి అయితే మంచిదన్నది తన అభిప్రాయం అని అన్నారు. కాగా రాజకీయ పార్టీలన్నీ విశాల దృక్పధంతో ఆలోచించి భగవత్‌కు మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేత షరీఫ్ విజ్ఞప్తి చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/