Begin typing your search above and press return to search.
మోస్ట్ ఎలిజిబుల్ సీఎం క్యాండేట్ నేనే- జానా
By: Tupaki Desk | 6 May 2018 5:05 AM GMTపెద్దలు - సీనియర్ నాయకులు - సౌమ్యుడు అనే పేరున్న కాంగ్రెస్ నేత - ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి తీరుపై హస్తం పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లలో ఒకరైనప్పటికీ ఆ పార్టీలో అందరూ గౌరవిస్తారనే పేరున్న అతికొద్దిమంది నాయకుల్లో జానారెడ్డి ఒకరు. గత కొద్దికాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న జానారెడ్డి పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని, ఆ మాటను ఎవరైనా కాదంటే ప్రజలు అంగీకరించబోరని ప్రతిపక్ష నేత కె జానారెడ్డి చెప్పారు. అయితే టీమ్ లీడర్ సెంచరీ చేసినా మ్యాచ్ ఓడిపోయిన పరిస్థితులూ ఉన్నాయని వ్యాఖ్యానించారు.
తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన జానారెడ్డి...ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకూ సీఎం అర్హతలున్నాయని పేర్కొంటూ అందుకు కారణాలు వెల్లడించారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ ఇప్పించింది తానేనన్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందు తెలంగాణ ఇచ్చి ఎన్నికలకు పోతే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పక్కా ప్రణాళిక రూపొందించిందన్నారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేసిన తర్వాత పార్టీ పట్టించుకోలేదనే విమర్శలు సరైనవి కావన్నారు. పార్టీ అన్ని రకాలు చర్యలు చేపట్టిందని ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని హైకోర్టుకు పిలిపించింది కూడా పార్టీనే కదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో తానే స్వయంగా అభిషేక్ సింఘ్వీతో మాట్లాడానని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అభిషేక్ సింఘ్వీని పిలిచి ఈ కేసును చూడమని చెప్పారన్నారు. తన కొడుకు ఎక్కడినుంచి పోటీచేయాలని నిర్ణయించేది కేవలం అధిష్టానం మాత్రమేనన్నారు. ఎన్నికలకుముందే టికెట్లు ప్రకటించడం సరైందికాదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.